12 June, 2026 | 5:32 PM

Breaking News

విద్య అభివృద్ధికి ప్రభుత్వం కృషి: జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్   •   వ్యాధుల నివారణపై దృష్టి సారించండి   •   అంతర్జాతీయ క్రికెట్‌కు కేన్ విలియమ్సన్ వీడ్కోలు   •   శ్రీ సరస్వతీ శిశుమందిర్‌లో గాయత్రి హోమం   •   చిన్న బెండరాలో మాలి సంఘం నూతన కమిటీ ఏర్పాటు   •   జొన్న పంట కొనుగోళ్లలో ప్రజా ప్రభుత్వంపైన రైతులకు భరోసా కలిగింది   •   శ్రీధర్ బాబును విమర్శిస్తే పుట్ట మీ రాజకీయ సమాధికి మేమే పునాది వేస్తాం   •   హైదరాబాద్‌కు ఛత్తీస్‌గఢ్ సీఎం.. స్వాగతం పలికిన మంత్రి ఉత్తమ్   •   వానకాలంలో వేయవలసిన పంటల గురించి రైతులకు అవగాహన   •   ఇంటర్ ప్రవేశానికి భద్రాచలంలో 15న స్పాట్ కౌన్సెలింగ్   •  

సీఎం కప్ జిల్లాస్థాయి ఆర్చరీ పోటీలు ప్రారంభం

10-02-2026 12:34 AM

దోమకొండ, ఫిబ్రవరి9, (విజయ క్రాంతి): దోమకొండ గడికోటలోని మైదానంలో సోమవారం సీఎం కప్ జిల్లాస్థాయి ఆర్చరీ పోటీలను దోమకొండ సర్పంచ్ ఐరెని నరసయ్య, జిల్లా ఆర్చరీ అసోసియేషన్ అధ్యక్షుడు తీగల తిరుమల్ గౌడ్ ఘనంగా ప్రారంభించారు. రాష్ట్ర ఆర్చరీ సంఘం అధ్యక్షుడు కామినేని అనిల్ కుమార్ సహకారంతో ఈ పోటీలను దోమకొండలో నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. పోటీల్లో ఇండియన్ రౌండ్ 30 మీటర్ల బాలికల విభాగంలో జి. సహస్ర, బాలుర విభాగంలో ఎస్.కె. రెహాన్ ఎంపికయ్యారు.

ఇండియన్ రౌండ్ 40 మీటర్లలో బాలికల విభాగంలో ఎన్. భావన, బాలుర విభాగంలో పీఆర్. రామచరణ్ విజేతలుగా నిలిచారు. రికర్వ్ రౌండ్లో బాలికల విభాగంలో బి. వర్షిణి, పి. నక్షత్ర, బాలుర విభాగంలో నవీన్, ఎస్. స్నేహిత్ ఎంపికయ్యారు. కాంపౌండ్ రౌండ్ 50 మీటర్ల విభాగంలో శ్రీ వైష్ణవి విజయం సాధించారు. జిల్లాస్థాయిలో ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయికి ఎంపికైన క్రీడాకారులను నిర్వాహకులు అభినందించారు. వీరు ఖమ్మంలో నిర్వహించే సీఎం కప్ రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమంలో పీడీ నరసింహారెడ్డి, గడికోట ట్రస్ట్ మేనేజర్ బాబ్జి, విలువిద్య శిక్షకులు ప్రతాప్ దాస్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ గోపాల్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సీతారాం మధు, నాయకులు మర్రి శేఖర్, సిద్ధరాములు, రాజేందర్, రమేష్ గౌడ్, జాతీయ క్రీడాకారిణి సింధుజ తదితరులు పాల్గొన్నారు.