calender_icon.png 10 February, 2026 | 3:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా సీఎం కప్ జిల్లాస్థాయి క్రీడా పోటీలు

10-02-2026 01:36:28 AM

జిల్లా యువజన క్రీడల అధికారి అఖిలేష్‌రెడ్డి

సంగారెడ్డి, ఫిబ్రవరి 9:సీఎం కప్-2025 జిల్లా స్థాయి క్రీడా పోటీలను సోమవారం సంగారెడ్డి అంబేద్కర్ స్టేడియం గ్రౌండ్స్లో ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా యువజన క్రీడలు, సాంఘిక సంక్షేమ అభివృద్ధి శాఖ అధికారి అఖిలేష్ రెడ్డి మాట్లాడుతూ సీఎం కప్ క్రీడా పోటీలను గ్రామస్థాయి నుంచే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గ్రామ, మండల, అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి పోటీలలో విజయం సాధించిన క్రీడాకారులను జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు వెల్లడించారు. ఈ జిల్లాస్థాయి పోటీలు రెండు రోజుల పాటు నిర్వహించనున్నట్లు తెలిపారు.

వివిధ స్థాయిలలో ప్రతిభ చాటిన క్రీడాకారులు జిల్లాస్థాయి పోటీలకు హాజరయ్యారని పేర్కొన్నారు. జిల్లా స్థాయిలో విజయం సాధించిన క్రీడాకారులను రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు పంపడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్రస్థాయి సీఎం కప్ క్రీడా పోటీలు ఈనెల 20వ తేదీ నుండి ప్రారంభం కానున్నట్లు అఖిలేష్ రెడ్డి తెలిపారు. జిల్లాస్థాయి విజేతలు రాష్ట్రస్థాయిలో కూ డా ప్రతిభను చాటి సంగారెడ్డి జిల్లాను మొదటి స్థానంలో నిలపాలని ఆశాభావం వ్యక్తం చేశారు.

జిల్లా స్థాయిలో వాలీబాల్, కబడ్డీ, ఖో-ఖో, బాస్కెట్బాల్, హ్యాండ్బాల్, కరాటే, వుషు కిక్ బాక్సింగ్, ఫుట్బాల్, ప్రేస్లింగ్, జూడో, బాక్సింగ్ నందు క్రీడాకారులకు క్రీడలు నిర్వహించడం జరిగిందనీ ,ఈ క్రీడలలో 1500 మంది క్రీడాకారులు పాల్గొన్నట్లు తెలిపారు. ఈ క్రీడలలో మొదటి , రెండవ స్థానంలో గెలుపొందిన క్రీడాకారులకు బహుమతి ప్రదానం చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో యస్.జి.యఫ్. సెక్రెటరి శ్రీనివాస్ , టి.ఎన్.జి.ఓ మరియు అథ్లెటిక్ సెక్రెటరీ జావిద్ అలీ , హ్యాండ్బాల్ సెక్రెటరి విజయ్ , స్విమ్మింగ్ సెక్రెటరి శశ్వంత్ , బాల్ బ్యాడ్మింటన్ విజయ్ బాస్కర్, వ్యాయామ ఉపాధ్యాయులు క్రీడాకారులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.