calender_icon.png 10 February, 2026 | 3:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేదల కోసం పోరాడే పార్టీ టీఆర్పీ

10-02-2026 01:35:27 AM

  1. మున్సిపల్ ఎన్నికల్లో మా పార్టీ అభ్యర్థులను గెలిపించండి
  2. పార్టీ అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న

హైదరాబాద్, ఫిబ్రవరి 9 (విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికల సందర్భంగా తెలంగాణ ప్రజలకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్పీ) అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సోమవారం సందేశాన్ని అందజేశారు. రాష్ట్రంలోని మున్సిపాలిటీల అభి వృద్ధి, ప్రజల హక్కుల పరిరక్షణ, ముఖ్యంగా బీసీ, దళిత, గిరిజన, పేద వర్గాల న్యాయమైన వాటా కోసం పోరాడే ఏకైక పార్టీ తెలం గాణ రాజ్యాధికార పార్టీ అని అన్నారు.

మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలందరూ టీఆర్పీ అభ్యర్థులను గెలిపించాలని, ముఖ్యంగా కత్తెర గుర్తుపై ఓటు వేసి తెలంగాణ రాజ్యాధికార పార్టీకి మద్దతు ఇవ్వాలని ఆయన ప్రజ లను కోరారు. ప్రజల సమస్యలపై ప్రశ్నించే, అవినీతిపై పోరాడే, పాలనలో ప్రజల రాజ్యాధికారాన్ని తీసుకొచ్చే లక్ష్యంతో టీఆర్పీ పనిచేస్తుందని స్పష్టం చేశారు.

ఎన్నికల షెడ్యూల్ చాలా తక్కువ సమయం ఉండడం వల్ల రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు వెళ్లి నేరుగా ప్రచారం చేయలేకపోయానని తెలిపారు. అయినప్పటికీ, ప్రజల మనసుల్లో టీఆర్పీపై ఉన్న నమ్మకం, విశ్వాసమే తమకు అసలైన బలమని అన్నారు.

మున్సిపాలిటీల్లో మల్లన్న ప్రచారం

సంగారెడ్డి జిల్లా సదాశివపేట మున్సిపాలిటీ పరిధిలోని 16వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి గుజ్జరి శంకర్ గెలుపు కోసం సోమవారం తీన్మార్ మల్లన్న ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. డ్రైనేజ్, కరెంట్ లైట్స్, తాగునీరు వంటి మౌలిక సమస్యలపై తక్షణమే స్పందించి పరిష్కారం దిశగా పని చేసే నాయకుడు గుజ్జరి శంకర్ అని పేర్కొన్నారు.

సదాశివపేట అభివృద్ధి, ప్రజల గౌరవం, హక్కుల సాధన తెలంగాణ రాజ్యాధికార పార్టీతోనే సాధ్యమని, శంకర్ గెలిపించాలని కోరారు. మేడ్చల్ జిల్లా మూడచింతలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 15వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి ఎల్ల అశ్విని -సంజీవులు గెలుపు కోసం తీన్మార్ మల్లన్న ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు రాజకీయ ప్రాతినిధ్యం పెరగాలంటే పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.