calender_icon.png 22 January, 2026 | 10:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రౌడీ షీటర్‌గా ప్రవర్తిస్తున్న సీఎం

22-01-2026 12:08:20 AM

మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్

కరీంనగర్ క్రైం, జనవరి 21 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక రౌడీషీటర్ గా ప్రవర్తిస్తున్నారని కరీంనగర్ జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్ అన్నారు. బుధవా రం బిఆర్‌ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి రెండవ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ దూషించడంతో పాటు బి ఆర్‌ఎస్ పార్టీకి చెందిన జెండా గద్దెలను కూల్చివేయాలని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు పిలుపునివ్వడం హాస్యాస్పదమన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీ చెందిన వ్యక్తా, కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తా అర్థం కావడంలేదని ఎద్దేవా చేశారు. సీఎం చేసిన వ్యాఖ్యలపై తీసుకోవాలని త్వరలో డీజీపీ కి ఫిర్యాదు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బీ ఆర్ ఎస్ పార్టీ మైనారిటీ అధ్యక్షులు మీర్ షౌకత్ ఆలి, ఆరే రవి గౌడ్, మాజీ కార్పొరేటర్ ఎదుల్ల రాజశేఖర్, శాతవాహన యూ నివర్సిటీ బి ఆర్ ఎస్ వి అధ్యక్షులు చుక్క శ్రీనివాస్, అధ్యక్షులు బొంకూరి మోహన్, సోమిరెడ్డి నరేష్ రెడ్డి, పబ్బతి శ్రీనివాస్ రెడ్డి, శ్రీనివాస్, దినేష్ , అన్వేష్, విక్రమ్, తదితరులు పాల్గొన్నారు.