22-01-2026 12:07:49 AM
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
ఆదిలాబాద్/ ఉట్నూర్ జనవరి 21 (విజయక్రాంతి) : ఆదివాసీ గిరిజనులకు చాలా కాలంగా పెండింగ్లో ఉన్న అటవీ భూమి హక్కుల పట్టాల సమస్యను సమగ్రంగా పరిష్కరిస్తామని, ప్రజా ప్రభుత్వం లో అర్హులైన ప్రతి ఆదివాసీకి న్యాయం జరుగుతుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క భరోసా ఇచ్చారు. ప్రభుత్వం ప్రతిష్టా త్మకంగా అమలు చేస్తున్న ఇందిరా సౌర జల గిరి వికాసం పథకం ద్వారా గిరిజన భూములకు సాగునీరు, విద్యుత్ సౌకర్యం కల్పించ డమే లక్ష్యమని తెలిపారు.
బుధవారం ఆదిలాబాద్ జిల్లాలో గిరిజన సంక్షేమ శాఖ మం త్రి అట్లూరి లక్ష్మణ్, ట్రైకార్ ఛైర్మన్ బెల్లయ్య నాయక్ తేజవత్ లతో కలిసి డిప్యూటీ సీఎం విస్తృతంగా పర్యటించారు. జిల్లాకు వచ్చిన డిప్యూటీ సీఎం ఎమ్మెల్యే లు వెడ్మ బొజ్జు పటేల్, అనిల్ జాదవ్, జిల్లా కలెక్టర్ రాజార్షి షా, ఎస్పీ అల్ మహాజన్, ఐటిడిఏ పీ.ఓ యువరాజ్ మర్మాట్, జిల్లా నేతలు ఘనంగా స్వాగతం పలికారు. ముందుగా ఉట్నూర్ మండలంలోని దంతన్పల్లి గ్రామంలోని డా. బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ గృహప్రవేశ మహోత్సవంలో వారు పాల్గొన్నారు.
లబ్ధిదారురాలు లింగంపెల్లి తారమ్మతో కలిసి రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి నూతన గృహాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా గృహ యజ మాని తారమ్మ కు పట్టు చీర అందించి సత్కరించారు. అనంతరం ఉట్నూర్ మండలం కోలంగూడ గ్రామంలో పర్యటించిన డిప్యూటీ సీఎం, మంత్రి పర్యటించారు. ఈ సందర్భంగా కొమురం సూ రు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
అదేవిదంగా కుమ్మరి తాండలో 25 ఎకరాల విస్తీర్ణంలో రూ.200 కోట్ల వ్యయంతో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్కు ఉప ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. ఖానాపూర్ నియోజకవర్గంలో విద్యుత్ సమస్యల పరిష్కారానికి రూ.13 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయనున్న 33/11 కేవీ విద్యుత్ సబ్స్టేషన్లకు భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ... ఆదివాసుల హక్కుల పరిరక్షణ కోసం, గిరిజనుల ఆత్మగౌరవం కోసం ప్రాణత్యాగం చేసిన వీరుడు కొమురం సూరు త్యాగాలు చిరస్మరణీయమని అన్నా రు.
గిరిజనుల హక్కుల కోసం కొమురం సూరు సాగించిన పోరాటం ప్రతి తరానికి మార్గదర్శకమని, ఆయన ఆశయ సాధన కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. అర్హులైన ప్రతి నిరుపేదకు సొంత ఇల్లు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని స్పష్టం చేశారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రవ్యాప్తంగా 4 లక్షల 50 వేల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశామని, ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున కేటాయించామని తెలిపారు. ప్రత్యేకంగా ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొంటూ, ఇప్పటి వరకు జిల్లాకు రూ.150 కోట్ల నిధులను మంజూరు చేసినట్లు వెల్లడించారు.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేస్తూ, పనుల పురోగతిని బట్టి వారం వారం లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా నిధులు జమ చేస్తున్నామని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ఒక నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ దశలవారీ గా ఇళ్లు మంజూరు చేస్తామని భరోసా ఇచ్చారు. గిరిజన బిడ్డలు అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యనభ్యసించి, దేశ భవిష్యత్తును నిర్మించే ఉత్తమ పౌరులుగా ఎదగాలన్నదే ప్రభుత్వ ఆకాంక్ష అని పేర్కొన్నారు. ప్రజల సంక్షేమo కోసం నేరుగా నగదు బదిలీ ద్వారా ఇప్పటివరకు రూ.1,21,874 కోట్లను ప్రజల ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు.
మహిళా సాధికారత లక్ష్యంగా ఏటా మహిళా సంఘాలకు రూ.20 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు అందిస్తున్నామని చెప్పారు. వ్యవసాయ రంగంలో రూ.12,500 కోట్లతో ‘ఇందిరా సౌర గిరి వికాసం’ పథకం అమలు చేస్తున్నామని, వరికి క్వింటాల్కు రూ.500 బోనస్తో పాటు రైతు రుణమాఫీ అమలు చేస్తున్నామని తెలిపారు. 96 లక్షల కుటుంబాలకు సన్నబి య్యం పంపిణీ ద్వారా ఆహార భద్రత కల్పిస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.