22-01-2026 12:09:02 AM
కలెక్టర్ కే హరిత
కుమ్రం భీం ఆసిఫాబాద్ ,జనవరి 21(విజయ క్రాంతి): 10వ తరగతి విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని, వార్షిక పరీక్షలలో ఉత్తమ ఫలితాలు సాధించే దిశగా సన్నద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ కె. హరిత అన్నారు. బుధవారం ఉదయం ప్రార్థన సమయానికి జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలను ఆకస్మి కంగా సందర్శించి తరగతి గదులు, పరిసరాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 10వ తరగతి వార్షిక పరీక్షలు సమీపిస్తున్నందున ఉత్తమ ఫలితాల సాధన దిశగా విద్యార్థులను సన్నద్ధం చేయాలని తెలిపారు. విద్యార్థులకు మెనూ ప్రకా రం సకాలంలో పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందించాలని, విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో ఉపాధ్యాయులు విద్యాబో ధన చేయాలని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు సకల సదుపాయాలు కల్పించి నాణ్యమైన విద్య అందించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, ఈ క్రమంలో విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించి, నాణ్యమైన విద్య అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు.
10వ తరగతి వార్షిక పరీక్షలలో 100 శాతం ఉత్తీర్ణత సాధించేలా ఉపాధ్యాయులు సమన్వయం తో కృషి చేయాలని తెలిపారు. 10వ తరగతి విద్యార్థులతో మాట్లాడుతూ పాఠశాలలో కల్పిస్తున్న సౌకర్యాలు, బోధన విధానాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. సబ్జెక్టులను పాఠ్యాంశాలు అర్థం కాని పక్షంలో ఉపాధ్యాయులను అడిగి నివృత్తి చేసుకోవాలని, వార్షిక పరీక్షలకు ఏకాగ్రతతో సిద్ధం కావాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.