సీఎంఆర్‌ఎఫ్ సద్వినియోగం చేసుకోవాలి
16-05-2026 01:11 AM
ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి
మేడ్చల్, మే 15(విజయ క్రాంతి): సీఎంఆర్‌ఎఫ్ పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి అన్నారు. శుక్రవారం లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజలకు ఆపద సమయంలో సిఎంఆర్‌ఎఫ్ ఉపయోగపడుతుందన్నారు. సీఎంఆర్‌ఎఫ్ మంజూరు చేయించిన మల్లారెడ్డికి లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గోపని వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.






