3 April, 2026 | 3:10 AM

పదో తరగతి పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

03-04-2026 12:48 AM

నిజామాబాద్, ఏప్రిల్ 2 (విజయక్రాంతి): బోధన్ పట్టణంలోని విద్యా వికాస్ జూనియర్ కళాశాలలో కొనసాగుతున్న  పదవ తరగతి పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠి గురువారం తనిఖీ చేశారు. ఆయా తరగతి గదులను సందర్శించి పరీక్షల నిర్వహణ సరళిని పరిశీలించారు.

విధులు నిర్వర్తిస్తున్న అధికారులు, సిబ్బందితో ఎవరైనా సెల్ ఫోన్లు తెచ్చారా అని ఆరా తీశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరు కూడా పరీక్షా కేంద్రాల్లోకి సెల్ ఫోన్లు తేకూడదని, కట్టుదిట్టమైన పర్యవేక్షణ జరపాలని నిర్వాహకులను ఆదేశించారు.  సీ.సీ కెమెరా రికార్డింగ్ నడుమ ప్రశ్న పత్రాల సీళ్లు తెరిచారా లేదా అని తనిఖీ చేశారు. కలెక్టర్ వెంట పరీక్షా కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ మంగళ ఉన్నారు.