calender_icon.png 19 May, 2025 | 9:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కమ్యూనిస్టు ఉద్యమానికి దిక్సూచి సుందరయ్య

19-05-2025 04:53:23 PM

జాజిరెడ్డిగూడెం/అర్వపల్లి: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట రథసారధి, బడుగు బలహీన వర్గాల నాయకుడు, దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ దిక్సూచి కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య అని సీపీఎం మండల కార్యదర్శి వజ్జె శ్రీనివాస్ అన్నారు. కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 40వ వర్ధంతి సందర్భంగా సోమవారం మండల కేంద్రం అర్వపల్లి, జాజిరెడ్డిగూడెం గ్రామంలో సీపీఎం గ్రామశాఖ, సుందరయ్య అభిమానుల ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

అనంతరం పలువురు నాయకులు మాట్లాడుతూ... ప్రజాసేవ కోసం వారసత్వంగా వచ్చిన ఆస్తిని పార్టీకి దారాదత్తం చేసిన త్యాగధనుడు సుందరయ్య అని, ఆయన చూపిన మార్గం నేటి తరానికి ఆదర్శమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు, సుందరయ్య అభిమానులు శిగ వెంకన్న, సంపతి వెంకన్న, శిగ రవికుమార్, జమడగుంట్ల కృష్ణయ్య, కొమ్ము విజయ్ కుమార్, పగిడిమర్రి శేఖర్, వజ్జె సైదయ్య, నర్సింగ వెంకటేశ్వర్లు, వినయ్, వీరన్న, యాదగిరి, శ్రీను తదితరులు పాల్గొన్నారు.