calender_icon.png 19 May, 2025 | 6:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మర్రిగూడ తహసీల్దార్ గా జక్కర్తి శ్రీనివాసులు..

19-05-2025 04:55:59 PM

మునుగోడు/మర్రిగూడ (విజయక్రాంతి): నల్లగొండ జిల్లా మర్రిగూడ మండల నూతన తహసీల్దార్ గా సోమవారం జక్కర్తి శ్రీనివాసులు బాధ్యతలు చేపట్టారు. గతంలో ఇక్కడ 9 సంవత్సరాలు సీనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహించారు. డిప్యూటీ తహసీల్దార్గా దేవరకొండలో పనిచేసి, తహసీల్దార్గా సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెంలో విధులు నిర్వహించారు. అక్కడి నుంచి సొంత జిల్లాకు తహసీల్దార్గా వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు, విద్యార్థులకు, ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని విధాలా సహకరిస్తానని తెలిపారు. అలాగే ఇక్కడ పని చేసిన బక్క శ్రీనివాస్ మహబూబ్నగర్ జిల్లాకు బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బంది స్వాగతం పలికి, పుష్పగుచ్చం అందించి సన్మానించారు.