calender_icon.png 19 May, 2025 | 6:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీలను అమలుపరచాలి..

19-05-2025 04:49:50 PM

జిల్లా కార్మిక సంఘం కార్యదర్శి బొలుగురి నరసింహ..

మునుగోడు (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీలు ఆరు గ్యారెంటీలను అమలు పరచాలని జిల్లా కార్మిక సంఘం కార్యదర్శి బొలుగురి నరసింహ అన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ రత్తిపల్లి గ్రామ శాఖ మహాసభ మాధగొని నరసింహ అధ్యక్షతన జరిగిన సమావేశంలో హాజరై మాట్లాడారు. గ్రామీణ ప్రాంతంలో ఉన్న సమస్యలపై పోరాటాలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. బ్రాహ్మణ వెలముల ఉదయం సముద్రం నుండి పులి పలుపుల చెరువులు నింపాలని అన్నారు. గ్రామాల్లో కలవలపల్లి గూడూపురు చెరువు నింపాలని ఇందిరమ్మ ఇండ్లకు ఎలాంటి నిబంధనలు లేకుండా అర్హులైన వారందరికీ మంజూరు చేయాలని కోరారు.

గత ప్రభుత్వం పది సంవత్సరాల నుండి వృద్ధాప్య, వితంతు, వికలాంగుల, ఒంటరి మహిళ పెన్షన్లు మంజూరు చేయడంలో జాప్యం చేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీ మేరకు  పెన్షన్లు, అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాజీవ్ యువశక్తి పథకానికి సివిల్ స్కోర్ నిబంధన లేకుండా మంజూరు చేయాలని అన్నారు. ఈ సమస్యలు పరిష్కారం కాకపోతే ఎర్రజెండా ఆధ్వర్యంలో పోరాటాలు నిర్వహిస్తామని అన్నారు. సిపిఐ మునుగోడు మండల కార్యదర్శి చాపల శీను మాట్లాడుతూ... గ్రామీణ ప్రాంతంలో అనేక సమస్యలు లేని సమస్యల పరిష్కారం కొరకు పోరాటాలు మార్గం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీ ఇచ్చిన ఆర్గారంటీలను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో రెచ్చిపెల్లి గ్రామం సిపిఐ కార్యదర్శిగా మొకాల పరమేశ సహాయ కార్యదర్శిగా రాచమల్ల మహేష్ కార్యవర్గ సభ్యులుగా మాధవ్ నరసింహ పున్నం యాదయ్య పగిళ్ల స్వామి బొమ్మగోని స్వామి పగిళ్ల శంకరయ్య ఏకగ్రీవ ఎన్నిక ఎన్నుకున్నారు.