మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సీపీ సందర్శన
14-05-2024 01:59 AM
మంచిర్యాల, మే 13 (విజయక్రాంతి): జిల్లాలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాలను రామగుండం సీపీ శ్రీనివాస్ సోమవారం పరిశీలించారు. కోటపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని పంగిడి సోమారంలోని స్కూల్, చెన్నూర్ ప్రభుత్వ పాఠశాల, బెల్లంపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను, రాపన్‌పల్లిలోని అంతర్రాష్ట్ర చెక్ పోస్టును తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా నిఘా ఏర్పాటు చేశామని తెలిపారు. సీపీ వెంట మంచిర్యాల డీసీపీ, మంచిర్యాల, జైపూర్ ఏసీపీలు, సీఐలు ఉన్నారు.




