18 May, 2026 | 3:09 AM

కాంగ్రెస్ ప్రభుత్వం అన్నిరంగాల్లో విఫలం

18-05-2026 02:19 AM

వచ్చేది బీఆర్‌ఎస్ ప్రభుత్వమే...

ఉమ్మడి జిల్లా సమన్వయ కర్త 

వి. గంగాధర్ గౌడ్

బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటే...

బాజిరెడ్డి గోవర్ధన్

బాన్సువాడ, మే 17 (విజయ క్రాంతి):  కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందనీ, వచ్చేది బీఆర్‌ఎస్ ప్రభుత్వమే అని ఉమ్మడి జిల్లా సమన్వయ కర్త వి. గంగాధర్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. బాన్సువాడ నియోజకవర్గ స్థాయి బీఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశం ఆదివారం పట్టణంలో జరిగింది. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయడంపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేసేందుకు ఈ సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా సభ్యత్వ నమోదుపై ఉమ్మడి జిల్లా సమన్వయ కర్త వి. గంగాధర్ గౌడ్ మాట్లాడుతూ ‘కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైంది. వచ్చేది బీఆర్‌ఎస్ ప్రభుత్వమే‘ అని ధీమా వ్యక్తం చేశారు. బూత్ స్థాయి కమిటీల ఏర్పాటు  

‘బాజిరెడ్డి గోవర్ధన్  నాయకత్వంలో పార్టీని బలోపేతం చేయాలి. బాన్సువాడలో 259 పోలింగ్ బూతులు ఉన్నాయి. 518 మంది పోలింగ్ బూత్ యాక్టివ్ కార్యకర్తలు కావాలి. 50 మందితో సమన్వయ కమిటీ ఉంటుంది. ఇందులో సర్పంచ్లు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రతినిధులు, బూత్ కమిటీ సభ్యులు ఉంటారు. ప్రతి బూత్లో ఇద్దరు ఆండ్రాయిడ్ ఫోన్ ఉన్నవారు కావాలి‘ అని గంగాధర్ గౌడ్ వివరించారు.

 ప్రతి జిల్లాకు ఒక టెక్నీషియన్ ఉంటాడు. సమయం ఇచ్చిన వారినే ఈ బాధ్యతకు ఇవ్వండి‘ అని సూచించారు. కార్యకర్తలు నిరాశ పడొద్దు. బాజిరెడ్డి గోవర్ధన్ అండగా ఉన్నారు. నియోజకవర్గానికి ఒక ఇంచార్జిని పెట్టబోతున్నాం. కార్యకర్తలకు రక్షణ కవచంగా ఉంటాం. ఎప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరిగినా బాన్సువాడలో బీఆర్‌ఎస్ గెలుస్తుంది. ఉమ్మడి జిల్లాలో 9 నియోజకవర్గాల్లో గెలుస్తాం.  

కార్యకర్తలు ధైర్యంగా ఉండాలి..

మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్...

మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ ‘సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఏ విధంగా చేపట్టాలో సూచనలు ఇవ్వడానికే ఈ సమావేశం ఏర్పాటు చేశాం. భారతదేశ చరిత్రలో ఫోన్, మొబైల్ ద్వారా ఫోన్ పే, గూగుల్ పే ఉపయోగించి సభ్యత్వ నమోదు చేయడం కొత్త విధానం. కేసీఆర్ ఆదేశాల మేరకు డిజిటల్ నమోదు జరుగుతోంది. యాప్ ద్వారా నమోదు చేస్తారు. ప్రతి గ్రామం నుంచి ఆన్లైన్ ఫోన్ ఉన్నవారు ముందుకు రావాలి‘ అని పిలుపునిచ్చారు.  మెంబర్షిప్ ముఖ్యం. 80 లక్షల మెంబర్లు కావాలి. మెంబర్షిప్ ఎక్కువ చేస్తే మనదే గెలుపు‘ అని స్పష్టం చేశారు.

బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటే  

‘బీజేపీ, కాంగ్రెస్ ఒకే పార్టీలు. బండి సంజయ్ కొడుకును కాపాడుతున్నారు. బీఆర్‌ఎస్ సోషల్ మీడియా వల్లే ఆ అమ్మాయికి న్యాయం జరిగింది. వాళ్లిద్దరూ ఒక్కటే. కార్యకర్తలు, నాయకులు అలగవద్దు. నేనే అందరినీ తట్టి లేపాలా?. ట్రైన్ లెక్క ఫాస్ట్గా ఉండాలి. అందరూ గ్రామాల్లో తిరగాలి. వేరే వారిని కన్వీన్స్ చేయాలి. వేరే ప్రాంతాల నుంచి ఎందుకు,ఇక్కడ నేనో... రవీందర్ రెడ్డియో కాదు, మీరే ముందుకు రండి‘ అని బాజిరెడ్డి పిలుపునిచ్చారు. జిల్లా రైతుబంధు మాజీ అధ్యక్షుడు అంజిరెడ్డి, మాజీ వైస్ చైర్మన్ జుబేర్, నార్ల రత్నకుమార్, కిషన్, సాయిలు, రాంచందర్, కౌన్సిలర్లు ఖలీల్, ఫెరోజ్, ఇసాక్, ఆతిఫ్, సాయిలు, అందె రాజు, రమేష్ యాదవ్  పాల్గొన్నారు.