16 June, 2026 | 2:38 AM

ప్రభుత్వ బడులలో చదివిద్దాం.. పిల్లల జీవితాల్లో వెలుగులు నింపుదాం

16-06-2026 12:00 AM

ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు...

జిల్లాలో పండగ వాతావరణంలో పాఠశాలల పున:ప్రారంభం

ఆదిలాబాద్, జూన్ 15 (విజయక్రాంతి): జిల్లాలో పాఠశాలల పున: ప్రారంభం వేడుకలు పండగ వాతావరణంలో జరిగాయి. మారుమూల మండలం గాదిగూడ లోని లోకారి (కె) గ్రామంలో సోమవారం చేపట్టిన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఎంపీ గోడం నగేష్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి ముఖ్య అతిథులుగా హాజరైయారు.

గ్రామానికి వచ్చిన అతిథులకు ఆది వాసీ సంప్రదాయ వాయిద్యాలతో ఘన స్వాగతం పలుకగా, కొమురం భీం విగ్రహానికి వారు పూలమాలలు వేసి ఘనంగా ని వాళులు అర్పించారు. ముందుగా గ్రామం లో నూతనంగా నిర్మించిన మండల ప్రాథమిక పాఠశాల భవనాన్ని అతిథులు ప్రా రంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్ లను అందజేశారు. అనంతరం గ్రామంలో నూతన రోడ్డు నిర్మాణ పనులకు కలెక్టర్, ఎంపీ, ఎమ్మెల్యే కలిసి భూమి పూజ చేశారు.

అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే సంకల్పంతో ప్రభు త్వం అన్ని వసతులతో నూతన పాఠశాల భవనాలను నిర్మిస్తోందని తెలిపారు. ప్రభు త్వ బడులలో చదువుద్దాం - పిల్లల జీవితాల్లో వెలుగులు నింపుదాం అనే నినాదాన్ని తల్లిదండ్రులంతా నిజం చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయుల ద్వారా చక్కని విద్యా బోధన అందుతుందని, ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ఇక్కడ డిజిటల్ మౌలిక వసతులు కల్పిస్తున్నామని స్పష్టం చేశారు.

గ్రామస్తులు, పాఠశాల యాజమాన్య కమిటీ సమన్వయంతో విద్యా ప్రమాణాల మెరుగుదలకు కృషి చేయాలని సూచించారు.ఎంపీ మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో గ్రామీణ ప్రాంతాల్లో విద్యా రంగ రూపురేఖలను మారుస్తున్నామని, విద్యార్థులు ఈ వసతులను సద్వినియోగం చేసు కొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. తల్లిదండ్రులెవరూ తమ పిల్లలను చదువుకు దూరం చేయవద్దని, బడి వయసు పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి మాధవి, స్థానిక సర్పంచ్ మండవి పుష్పలత జాకు, ఎంపీడీఓ శ్రీనివాస్, తహసీల్దార్ దీప్తి, ఇతర అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్థులు, తదితరులు పాల్గొన్నారు.