15-01-2026 02:44:03 AM
ముషీరాబాద్, జనవరి 14 (విజయక్రాంతి): ఎంతో ఘన చరిత్ర కలిగిన సికింద్రా బాద్ పేరును, అస్తిత్వాన్ని దెబ్బతీయాలనే దుర్మార్గమైన చర్యను మానుకోవాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాద వ్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ మేరకు బుధవారం ముషీరాబాద్ లోని మహమ్మదీయ ఫంక్షన్ హాల్ లో సికింద్రాబాద్ బచావో కార్యక్రమంలో భాగంగా ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం నిర్వహించా రు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడు తూ 250 సంవత్సరాల చరిత్ర గల సికింద్రాబాద్ పేరును తొలగించి మల్కాజ్ గిరి పేరిట కార్పొరేషన్ ఏర్పాటు చేయడం ఎంతవరకు సమంజసమని అయన ప్రశ్నించారు.
ప్రభుత్వానికి పేరు మార్చే అధికారం ఎవరిచ్చా రని, ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు శాశ్వతం కాదని, ప్రాంతాలు, చరిత్ర శాశ్వతంగా నిలుస్తుందని అన్నారు. సికింద్రాబాద్ బచావో పేరిట ఈనెల 17న నిర్వహిం చే ర్యాలీని విజయవంతం చేసేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు ద్విచక్ర వాహనాలపై తరలిరావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఠా గోపాల్, బీఆర్‌ఎస్ యువ నాయకుడు ముఠా జై సింహ, బీఆర్‌ఎస్ రాష్ట్ర మాజీ కార్యదర్శి ఎడ్ల హరిబాబు యాద, లస్కర్ జిల్లా సాధన సమితి అధ్యక్షుడు పవన్ కుమార్ గౌడ్, సీనియర్ నాయకుడు బింగి నవీన్, నియోజకవర్గ బీఆర్‌ఎస్ ఆరు డివిజన్లో అధ్యక్షులు వై.శ్రీని వాసరావు, కొండ శ్రీధర్ రెడ్డి, ఎం. రాకేష్ కుమార్, శ్రీనివాస్ రెడ్డి, శంకర్ ముదిరాజ్, వల్లాల శ్యామ్ యాదవ్, నియోజకవర్గ మీడియా సెల్ ఇంచార్జ్ ముచ్చ కుర్తి ప్రభాకర్, నాయకులు శివ ముదిరాజ్, దీన్ దయాల్ రెడ్డి, ఎ.శంకర్‌గౌడ్, బల్ల ప్రశాంత్, ఎన్ డి. సాయి కృష్ణ, గొల్లగడ్డ రాజశేఖర్ గౌడ్, తలారి శ్రీకాంత్ ముదిరాజ్, శ్రీనివాస్ యాదవ్, ఉమాకాంత్ ముదిరాజ్, పబ్బా కృష్ణ, వల్లాల శ్రీనివాస్ యాదవ్, పూస గోరఖ్నాథ్, బిక్షపతి పాల్గొన్నారు.