calender_icon.png 15 January, 2026 | 4:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అధికారుల వేధింపులకు రైల్వే ఇంజినీర్ ఆత్మహత్య

15-01-2026 02:47:12 AM

సీనియర్ అధికారులే చావుకు కారణమంటూ ఆందోళనకు దిగిన ఉద్యోగులు

సికింద్రాబాద్ జనవరి 14 (విజయ క్రాంతి): ఓ రైల్వే ఇంజనీర్ రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మౌలాలి లో చోటు చేసుకుంది. అయితే అధికారుల వేదింపులే తమ సహచర ఉద్యోగి ఆత్మహత్యకు కారణ మంటూ తోటి ఉద్యోగులు బుధవారం మౌలాలిలోని రైల్వే డీజిల్ లోకో షేడ్ వద్ద విధులు బహిష్కరించి ఆందోళనకుదిగారు.  ఉద్యోగులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కర్నూలు జిల్లాకు చెందిన రాజేష్ (38) మౌలాలి లోని డీజిల్ లొకో షేడ్ లో సీనియర్ సెక్షన్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. కాగా గత కొంత కాలంగా రాజేశ్ పై ఉన్నతాధికారుల వేధింపులు ఎక్కువయ్యాయని దీంతో మానసిక ఆందోలనకు గురైన రాజేశ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఉద్యోగులు తెలిపారు.

గత 14సంత్సరాలుగా విధులు నిర్వహిస్తున్న రాజేశ్ తన విధుల్లో ఎలాంటి పొరపాట్లు చేయలేదని, విధుల నిర్వహణలో నిబద్దత కలిగిన వ్యక్తి అన్నారు. ఎంతో నమ్మకంగా పనిచేసే అతని పై సీనియర్ డీఎంఈ సునీల్ కుమార్ ఏడిఎంఈ  విఆర్ రాజు వేధింపులకు గురి చేశారని, వారి వేధింపులు తట్టుకోలేక ఆయన ఒకానొక దశలో ఉద్యోగమే మానేసేందుకు సిద్దపడినట్లు ఉద్యోగులు తెలిపారు.ఈ విషయమై ఆయన భార్యాపిల్లలు సదరు అధికా రులను తన భర్తను వేధించవద్దని వేడుకున్నా వారు తమ వేధింపు లను ఆపలేదని ఆరోపించారు.

ఈ వేధింపులు తట్టుకోలేక రాజేశ్ బలవన్మ రణానికి పాల్పడ్డాడని అన్నారు. రాజేష్‌కు ముగ్గురు చిన్న పిల్లలు ఉన్నారని, ఆయన మృతితో ఆయన కుటుంబం రోడ్డున పడే పరిస్థితి కి వచ్చిందన్నారు.రాజేష్ మృతికి కారణమైన ఇద్దరు అధికారులను  సస్పెండ్ చేయా లని,అలాగే  రాజేశ్ భార్యకు ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు.ఈ ధర్నా సందర్బంగా పలువురు అధికారులు వచ్చి సమస్యను ఉన్నతాధికారుల దృష్టి కి తీసుకువెళతామని చెప్పారు.అయితే ఉన్నతాధికారు లు స్పష్టమైన హామీ ఇవ్వాలని, లేని పక్షంలో సోమవారం నుంచి తిరిగి తమ ఆందోళన కొనసాగిస్తామని ఉద్యోగులుతెలిపారు.