15-01-2026 02:41:42 AM
కుషాయిగూడ, డిసెంబర్ 14 (విజయక్రాంతి) : కుషాయిగూడ చక్రిపురం కాలనీ శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీదేవి భూదేవి సమేతంగా ఆలయంలో అంగరంగ వైభవంగా గోదాదేవి కల్యాణం ఘనంగా జరిగింది ఆలయ నిర్మాణ కర్త మలుగు ప్రతాపరెడ్డి వారి సతీమణి స్వర్ణలత కుమారులు చక్రధర్ రెడ్డి కుటుంబ సమేతంగా వారితోపాటు భక్తులు భారీ సంఖ్యలో గోదాదేవి కల్యాణోత్సవంలో పాల్గొని వేద ఆశీర్వాదాలు కళ్యాణోత్సవాన్ని ఘనంగా జరిపారు. ఇతర కాలనీల నుంచి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లను ఆలయ నిర్మాణ కర్తలు ధర్మకర్తలు ఏర్పాట్లను చేశారు.