17 April, 2026 | 2:48 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుంది

28-06-2025 12:00 AM
  1. మంజూరైన ఇళ్లను వెంటనే నిర్మించండి 

ఆర్థిక స్తోమత లేని వారికి వడ్డీ లేని అప్పు 

మహిళలు పొదుపు సంఘాల్లో సభ్యులుగా చేరండి 

రాష్ట్ర గిరిజన, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క 

చర్ల , జూన్ 27 (విజయక్రాంతి) తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ ప్రభు త్వం అండగా ఉంటుందని, అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఏళ్లు మంజూరు చేస్తామ ని, మంజూరైన ఇండ్లను తక్షణమే నిర్మించుకోవాలని రాష్ట్ర గిరిజన మహిళా, శిశు సం క్షేమ శాఖ, పంచాయతీరాజ్ మంత్రి ధనసరి సీతక్క అన్నారు. శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో విస్తృతంగా పర్యటించి పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలలో ప్రారంభించారు.

మండల పరిధి లోని కేశవాపురం పంచాయతీ లోగల రాళ్ల గూడెం గ్రామంలో నూతనంగా నిర్మించిన చింత ఫిల్లింగ్ స్టేషన్, లక్ష్మి కాలనీలో రూ 20 లక్షలతో నియమించిన నూతన పంచాయతీ భవనాన్ని ఆమె ప్రారంభించారు. అనంతరం రైతు వేదికలో జరిగిన కార్యక్రమంలో మం జూరు పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇల్లు లేని నిరు పేదలకు సొంత ఇంటి కలను కాంగ్రెస్ ప్రభు త్వం ద్వారానే సాధ్యమవుతుందన్నారు.

గ తంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్ళకు రూ లక్ష రూపాయలు చెల్లించారని, ఆనాడు సిమెంటు స్టీలు ధరలు తక్కువగా ఉండేవన్నారు. పెరిగిన ధరలకు అనుగుణం గా నేటి ఇందిరమ్మ ప్రభుత్వం ప్రతి ఇంటికి రూ 5 లక్షల రూపాయలు మంజూరు చే స్తుందన్నారు. భద్రాచలం నియోజకవర్గం 4500 పక్కా గృహాలను మొదటి విడతలు మంజూరు చేసినట్లు ఆమె తెలిపారు.

ఇల్లు రానీ నిరుపేదలు నిరుత్సాహం చెందాల్సిన అవసరం లేదని రెండవ దఫలో వారికి మంజూరు చేస్తామన్నారు.ఇ ళ్ళు మంజూరై ఆర్థిక స్తోమత లేని మహిళలకు ద్వారా వడ్డీ లేని అప్పును ఇప్పిస్తామన్నారు. దీంతో వా రికి సొంత ఇంటి కల నెరవేరుతుందని ఆమె తెలిపారు.

ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు పోరిక బలరాం నాయక్, భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పొదేం వీరయ్య , అధికారులు పాల్గొన్నారు తదితరులు పాల్గొన్నారు.