calender_icon.png 12 January, 2026 | 12:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉద్యమకారులకు కాంగ్రెస్ మోసం

11-01-2026 12:00:00 AM

  1. మాకిచ్చిన హామీలు నెరవేర్చేందుకు కృషి చేయండి
  2. టీఆర్పీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు తెలంగాణ ఉద్యమకారుల వినతి

హైదరాబాద్, జనవరి 10 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం తమను మోసం చేసిందని, తమకు కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలుకు కృషి చేయాలని కోరుతూ తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను శనివారం తెలంగాణ ఉద్యమకారులు కలిసి వినతిపత్రం అందజేశారు.

ఎన్నికల సమయంలో ఉద్యమకారు లకు అనేక హామీలిచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకొచ్చిన తరువాత తమను గాలికొది లేసిందని ఆవేదన చెందారు. ఉద్యమకారుల సమస్యలపై శాసనమండలిలో మాట్లాడాలని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను కోరారు.

తీన్మార్ మల్లన్నను కలిసిన వారిలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ర్ట ఉపాధ్య క్షుడు జెనిగే విష్ణువర్ధన్, రాష్ర్ట ఆర్గనైజింగ్ సెక్రటరీ కారింగుల నరేందర్ గౌడ్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఉద్యమకారుల ఫోరం అధ్యక్షుడు కొంతం యాదిరెడ్డి, ఇబ్రహీంపట్నం కన్వీనర్ నక్క జంగయ్య గౌడ్, అంబర్పేట్ మున్సిపాలిటీ అధ్యక్షుడు జోర్కా రాం అంబర్పేట్, మున్సిపాలిటీ ప్రధాన కార్యదర్శి చిత్రం కృష్ణ, టీఆర్పీ రంగారెడ్డి జిల్లా ఇన్‌చార్జి సూదగాని హరిశంకర్ గౌడ్, భయ్యా వెంకటేశ్వర్లు యాదవ్, రంగారెడ్డి జిల్లా అధికార ప్రతినిధి కోట్ల వాసుదేవ్ ఉన్నారు.