calender_icon.png 12 January, 2026 | 11:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముగ్గుల పోటీ విజేతలకు బహుమతులు అందజేత

11-01-2026 12:00:00 AM

ఈటల సమక్షంలో కేక్ కట్ చేసిన బానుక నర్మద 

సికింద్రాబాద్ జనవరి 10 (విజయ క్రాంతి): సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డ్ నామినేటెడ్  సభ్యురాలు బానుక నర్మద జన్మదినం సందర్బంగా శనివారం ఉదయాన్నే తాడ్‌బండ్ హనుమాన్ దేవాలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించారు..అనంతరం స్థానిక  మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్‌ని  కలసి వారి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగాకార్ఖాన లోని ఆర్కే ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వృద్ధాశ్రమం లో కేక్ కటింగ్ చేసి జన్మదిన వేడుకలు జరుపుకున్నారు.

ఈ సందర్భంగా బానుక నర్మద వృద్ధులకుపళ్ళు, మిఠాయి అందజేశారు.అలాగే సీతారాంపుర్‌లో బానుక నర్మద మల్లికార్జున్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీల నిర్వహించారు.అనంతరం మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్, బాలిక నర్మదతో కలిసి ముగ్గులను పరిశీలించారు. అనంతరం మల్కాజ్గిరి ఎంపీ ఈటెల సమక్షంలో బానుక నర్మద మల్లికార్జున చేత  మహిళలు,పార్టీ నాయకులు కేక్ కట్ చేసి సెలబ్రేషన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా ముగ్గురు పోటీలలో పాల్గొన్నప్రథమ, ద్వితీయ, తృతీయ విజేతలకు నిలిచిన వారికి బహుమతులు,అలాగే పాల్గొన్న అందరికీ కన్సిలేషన్ బహుమతులు అందజేశారు. ఈకార్యక్రమంలో మ హంకాళి జిల్లా ఉపాధ్యక్షులు బి.ఎన్ శ్రీనివాస్, స్థానిక బీజేపీ నాయకులు, కార్యకర్తలు, కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు..