8 March, 2026 | 3:37 AM

కాంగ్రెస్ పార్టీ అంటేనే సంక్షేమం

08-03-2026 12:35 AM

కార్మికుడు బలంగా ఉంటే దేశం బలంగా ఉంటుంది 

తన తండ్రి శ్రీపాదరావు కార్మికులకు ఎనలేని సేవలను అందించాడు

పీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీను బాబు

మంథని, మార్చి 7(విజయక్రాంతి): కార్మికుడు బలంగా ఉంటే దేశం బాలంగా ఉం టుందని, కాంగ్రెస్ పార్టీ అంటే సంక్షే మం, సంక్షేమం అంటే కాంగ్రెస్ పార్టీ అని పీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీను బాబు అన్నారు. రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు చొరవతో మెడికల్ బోర్డు పునరుద్ధరణ అవుతుందని, కాంట్రాక్ట్ కార్మికులకు బోనస్ రూ. 5000 వేల నుంచి 5500 వరకు వచ్చిందని,తన తండ్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ శ్రీపాదరావు కార్మికులకు ఎనలేని సేవలను అందించాడన్నారు.

శనివారం రామగిరి మండలం కేంద్రంలోని కమ్యూనిటీ హాల్లో ఐఎన్ టీయూసి జనరల్ బాడీ సమావేశం లో ఆయన మాట్లాడారు. ఐఎన్ టీయూసీ అనేది కేవలం ఒక ట్రేడ్ యూనియన్ సంస్థ మాత్రమే కాదు.. ఇది కార్మికుల గౌరవం, సామాజిక న్యాయం, వారి హక్కుల కోసం పోరాడిన గొప్ప సంస్థ అని పేర్కొన్నారు. ఉద్యమం చేసిన ఇండియన్ నేషనల్ కాం గ్రెస్ నాయకుల స్ఫూర్తితో ఏర్పడిన ఈ సం స్థ, దేశ అభివృద్ధి కార్మికుల సంక్షేమాన్ని పక్కన పెట్టకుండా సాగాలని ఎప్పుడూ గుర్తు చేస్తూ వచ్చిందని దుద్దిళ్ల శ్రీనుబాబు అన్నారు.

ఈ వేదిక నాకు వ్యక్తిగతంగా కూడా ఎంతో ప్రత్యేకమైనదని, నా తండ్రి శ్రీపాద రావు తన ప్రజా జీవితంలో ఎప్పుడూ కార్మికుల గౌరవం, వారి జీవనోపాధి రక్షణ కోసం కట్టుబడి పనిచేశారని, అదే విలువలను నా అన్న రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు కూడా తన ప్రజా జీవితంలో కొనసాగిస్తూ సమాన అవకాశాలు, కార్మిక సంక్షేమం, సమగ్ర అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారని,ఆ విలువల వారసత్వంతోనే నేను ఈ రోజు మీ ముందుకు వచ్చానని అన్నారు.

మన దేశ అభివృద్ధి గురించి మాట్లాడేటప్పుడు ఒక విషయం గుర్తుంచుకోవాలని, దేశ అభివృద్ధి అంటే కేవలం పరిశ్రమలు పెరగడం కాదని,కార్మికుల జీవితం మెరుగుపడ టమన్నారు. ఈరోజు కార్మికులు అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నారని, ఉద్యోగ భద్రత, సముచిత వేతనాలు, సామాజిక భద్రత, పనిస్థల భద్రత వంటి అంశాలు మరింత ము ఖ్యంగా మారాయని, ఇలాంటి సమయంలో ఐఎన్ టీయూ సి వంటి సంస్థల పాత్ర చాలా కీలకమైనదని స్పష్టంగా చెప్పారు.

కార్మికుల ఐక్యతే సామాజిక న్యాయం సాధించే గొప్ప శక్తి అని, నేను పీసీసీ జనరల్ సెక్రటరీగా, కాంగ్రెస్ తరఫున హామీ ఇవ్వాలనుకుంటున్నానని, కార్మికుల హక్కు లు, సంక్షేమం, గౌరవం కోసం అండగా ఉంటామన్నారు. ఐఎన్ టీయూసీ జనరల్ సెక్రెటరీ, స్థానిక వేతన రాష్ట్ర చైర్మన్ జనక్ ప్రసాద్, ఐఎన్‌టీయూసీ ఉపాధ్యక్షుడు కోట రవీందర్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తొట్ల తిరుపతి యాదవ్ పాల్గొన్నారు.