బీజేపీ కుట్రలను కాంగ్రెస్ అడ్డుకున్నది
పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్
చట్ట విరుద్ధంగా డీలిమిటేషన్ బిల్లు తెచ్చేందుకు ప్రయత్నించిన బీజేపీ కు ట్రలను కాంగ్రెస్ పార్టీ అడ్డుకున్నదని పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ అన్నారు. డీలిమిటేషన్‌ను అమలు చేసి ఉత్తర భారతదేశానికి ఎక్కువ సీట్లు పెంచుకుని రాజకీయ లబ్ధి పొందడానికి కేంద్రం చేపట్టిన రాజకీయ ఎత్తుగడ దెబ్బ తిన్నద న్నా రు. బిల్లు వీగిపోవడంతో బీజేపీ ప్రభుత్వ నియంత పోకడలకు అడ్డుకట్టపడిందని మహేష్‌కుమార్‌గౌడ్ పేర్కొన్నారు.
మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ 2023లో తెచ్చిన చట్టానికి కాంగ్రెస్ మద్దతు ఇచ్చిందన్నారు. ఈ చట్ట సవరణ పేరుతో 2029లోనే మహిళా రిజర్వేషన్లు అమలు చేస్తామని చెబుతూనే దొంగ చాటుగా డీలిమిటేషన్ అమలు చేసుకునేందుకు చేసిన కుట్రలు వీగిపోయినట్లు చెప్పారు.






