18 April, 2026 | 3:10 AM

బ్యాడ్మింటన్ జాతీయ స్థాయి పోటీలకు కోహెడ ఎస్‌ఐ అభిలాష్ ఎంపిక

18-04-2026 01:41 AM

కోహెడ, ఏప్రిల్ 17: బ్యాడ్మింటన్ జాతీయ స్థాయి పోటీలకు కోహెడ ఎస్‌ఐ పుల్లా అభిలాష్ ఎంపికైయ్యారు. ఈ సందర్బంగా ఎస్‌ఐ అభిలాష్ మాట్లాడుతూ.. హైదరాబాద్ పోలీస్ అకాడమీ (ఎన్జీవోస్) లో బ్యాడ్మింటన్ జాతీయ స్థాయి ఎంపిక పోటీలు జరిగాయన్నారు.

ఓపెన్ మెన్ డబుల్స్ విభాగంలో తనతో పాటుగా వేలేరు ఎస్త్స్ర సురేష్ జాతీయ పోటీలకు ఎంపికైనట్లు పేర్కొన్నారు. వచ్చే నెలలో ఉత్తరప్రదేశ్ లో జరుగనున్న జాతీయ పోటీల్లో ఇరువురు పాల్గొంటున్నాట్లుగా ఎస్‌ఐ తెలిపారు.