పత్తిపాక రిజర్వాయర్ నిర్మాణం చేపట్టాలి
26-06-2024 12:34 AM
మంత్రి ఉత్తమ్‌కు మంత్రి శ్రీధర్‌బాబు, ఎమ్మెల్యేల వినతి
మంథని, జూన్ 25 (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా రైతుల చిరకాల స్వప్నం పత్తిపాక రిజర్వాయర్ నిర్మాణం చేపట్టాలని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి పెద్దపల్లి ఎమ్మెల్యేలు కోరారు. మంగళవారం సచివాలయంలోని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ప్రభుత్వ విప్‌లు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్, విజయరమణారావు.. ఉత్తమ్‌కుమార్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పెద్దపల్లి జిల్లా రైతుల నీటి కష్టాలను తీర్చాలని కోరారు.






