వేలు కొరికిన కుక్క!
08-04-2026 01:29 AM
మహబూబాబాద్, ఏప్రిల్ 7 (విజయక్రాంతి): పిచ్చికుక్క ఓ వ్యక్తి వేలు కొరికిన ఘటన వరంగల్ జిల్లా, పర్వతగిరి మండలం కల్లెడ గ్రామంలో తీవ్ర కలకలం రేపింది. గ్రామానికి చెందిన చిరుత సతీష్ అనే వ్యక్తిపై పిచ్చికుక్క విచక్షణా రహితంగా దాడిచేసి కరిచింది.
చేతితో అడ్డుకోబోయిన అతని ఎడమచేతి వేలిని పూర్తిగా కొరికేసింది. దీంతో వేలు కిందపడిపోయింది. ఈ హఠాత్పరిణామంతో అక్కడే ఉన్న కొందరు కుక్కను తరిమేశారు. సతీష్ ప్రాణాలతో బయటపడ్డాడు. వెంటనే అతన్ని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రభుత్వం స్పందించి గ్రామాల్లో వీధికుక్కల బెడదను నివారించాలని, ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాలని గ్రామస్థులు కోరుతున్నారు.




