4 July, 2026 | 11:20 PM

Breaking News

అనురాగ్ వార్షిక స్నాతకోత్సవంలో 2,789 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం   •   హ్యూమన్‌ రైట్స్‌ ఫౌండేషన్‌ రాష్ట్ర కోఆర్డినేటర్ గా సాయి భాను   •   డ్రగ్స్, సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన   •   వేములవాడ నాయీ బ్రాహ్మణ అసోసియేషన్‌ నూతన కమిటీ   •   పేరం వెంకటేశ్వర రావుకి ఘన సన్మానం   •   నీటి సంపులో పడి చిన్నారి మృతి   •   సీఐ కరుణాకర్ కు జన్మదిన శుభాకాంక్షలు   •   కొత్త మోడల్ మార్కెట్‌లో మహిళా వ్యాపారుల కన్నీరు   •   దొడ్డి కొమరయ్య త్యాగం అందరికీ స్ఫూర్తిదాయకం   •   లయన్స్ క్లబ్ నేరేడుచర్ల ఆధ్వర్యంలో పింగళి వెంకయ్య వర్ధంతి, అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు   •  

దేశంలో తొలి ‘స్మార్ట్ కాక్లియర్ ఇంప్లాంట్’ శస్త్రచికిత్స

18-03-2026 12:15 AM

కిమ్స్ హాస్పిటల్స్ సికింద్రాబాద్‌లో విజయవంతం

హైదరాబాద్, మార్చి 17: వినికిడి సమస్యల చికిత్సలో భారతదేశంలోనే ఒక కీలక మైలురాయిగా, కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్‌లో మూడేళ్ల చిన్నారికి దేశంలో తొలి స్మార్ట్ కాక్లియర్ ఇంప్లాంట్ శస్త్రచికిత్సను వైద్యులు విజయవంతంగా నిర్వహించారు. తీవ్రమైన వినికిడి లోపం ఉన్న చిన్నారికి ఈ అత్యాధునిక ఇంప్లాంట్‌ను అమర్చడం ద్వారా వైద్యరంగంలో మరో కొత్త అధ్యాయం ప్రారంభమైం ది.

తీవ్రమైన వినికిడి లోపం (సుమారు 70 శాతం కంటే ఎక్కువ) ఉన్నవారికి సాధారణ వినికిడి యంత్రాలు సరైన ప్రయోజనం ఇవ్వనప్పుడు కాక్లియర్ ఇంప్లాంట్ శస్త్రచికిత్సను చేస్తారు. అయితే తాజాగా అమర్చిన ఈ స్మార్ట్ కాక్లియర్ ఇంప్లాంట్ సాంకేతికత భవిష్యత్తులో అప్డేట్ చేయగలిగే ప్రత్యేకతతో రూపొందించబడింది.సాంప్రదాయ కాక్లియర్ ఇంప్లాంట్లలో ఒకసారి శస్త్రచికిత్స చేసి లోపలి పరికరాన్ని అమర్చిన తర్వాత అది జీవితాంతం అలాగే ఉంటుంది.

బయట ఉండే ప్రాసెసర్లు మాత్ర మే మారుస్తారు. కానీ కొత్తగా ప్రవేశపెట్టిన స్మార్ట్ కాక్లియర్ ఇంప్లాంట్లో లోపలి ఇంప్లాంట్ ఫర్మ్‌వేర్‌ను భవిష్యత్తులో అప్‌గ్రేడ్ చేయగలగడం ప్రధాన ప్రత్యేకత.కొత్త సిగ్నల్ ప్రాసెసింగ్ విధానాలు లేదా సాంకేతిక అభివృద్ధులు వచ్చినప్పుడు మరొకసారి శస్త్రచికిత్స అవసరం లేకుండానే వాటిని ఈ పరికరంలో జోడించవచ్చు.కిమ్స్ హాస్పిటల్స్‌లో ఈ శస్త్రచికిత్సను ఈఎన్టీ విభాగం హెడ్, సీనియర్ కాక్లియర్ ఇంప్లాంట్ సర్జన్ డాక్టర్ జనారన్‌రావు జగిని నేతృత్వంలోని నిపుణుల బృందం విజయవంతంగా నిర్వహించింది.

ఈ బృందంలో చీఫ్ ఆడియాలజిస్ట్, కాక్లియర్ ఇంప్లాంట్ క్లినికల్ స్పెషలిస్ట్ డాక్టర్ శివప్రసాద్ బొడ్డుపల్లి, ఆడియాలజిస్ట్ డాక్టర్ దివ్య కూడా పాల్గొన్నారు. చిన్న వయసులోనే కాక్లియర్ ఇంప్లాంట్ చేయ డం వలన పిల్లలలో మాటలు నేర్చుకునే సామర్థ్యం, భాషా అభివృద్ధి సాధారణ స్థాయి కి చేరుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

3 ఏళ్ల వయసులో ఈ స్మార్ట్ కోక్లియర్ ఇం ప్లాంట్ చేయడం ద్వారా ఆ చిన్నారికి భవిష్యత్తులో మెరుగైన వినికిడి సామర్థ్యం ,సాధారణ భాషా అభివృద్ధికి మార్గం సుగమమైంది.ఈ విజయవంతమైన శస్త్రచికిత్సతో కిమ్స్ హాస్పిటల్స్ అంతర్జాతీయ స్థాయి సాంకేతికతను భారతీయ రోగులకు అందిస్తూ కాక్లియర్ ఇంప్లాంట్ చికిత్సలో కొత్త ప్రమాణాలను స్థాపిస్తోందని వైద్యులు తెలిపారు.