4 July, 2026 | 9:59 PM

Breaking News

అనురాగ్ వార్షిక స్నాతకోత్సవంలో 2,789 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం   •   హ్యూమన్‌ రైట్స్‌ ఫౌండేషన్‌ రాష్ట్ర కోఆర్డినేటర్ గా సాయి భాను   •   డ్రగ్స్, సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన   •   వేములవాడ నాయీ బ్రాహ్మణ అసోసియేషన్‌ నూతన కమిటీ   •   పేరం వెంకటేశ్వర రావుకి ఘన సన్మానం   •   నీటి సంపులో పడి చిన్నారి మృతి   •   సీఐ కరుణాకర్ కు జన్మదిన శుభాకాంక్షలు   •   కొత్త మోడల్ మార్కెట్‌లో మహిళా వ్యాపారుల కన్నీరు   •   దొడ్డి కొమరయ్య త్యాగం అందరికీ స్ఫూర్తిదాయకం   •   లయన్స్ క్లబ్ నేరేడుచర్ల ఆధ్వర్యంలో పింగళి వెంకయ్య వర్ధంతి, అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు   •  

సమాచార హక్కు రక్షణ చట్టం ఐదో రాష్ట్ర మహాసభను విజయవంతం చేయాలి

18-03-2026 12:14 AM

మఠంపల్లి, మార్చి 17 : మండల కేంద్రంలో ఈ నెల 24న ఏర్పాటు చేయనున్న సమాచార హక్కు రక్షణ చట్టం 2005  5వ రాష్ట్ర మహాసభను విజయవంతం చేయాలని జిల్లా సమాచార హక్కు రక్షణ చట్టం వర్కింగ్ ప్రెసిడెంట్ కాంపాటి సందీప్ అన్నారు.మంగళ వారం మండల కేంద్రంలో సమాచార హక్కు రక్షణ చట్టం సొసైటీ  పోస్టల్ ను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం 2005 ప్రకారం ప్రతి పౌరుడు ప్రభుత్వ సంస్థలలో  సమాచారాన్ని అడిగి తెలుసుకోవడం తన బాధ్యత అన్నారు. ప్రభుత్వ కార్యకలాపాలలో జవాబుదారీతనాన్ని పారదర్శకతను పెంచడానికి, అవినీతిని అరికట్టడానికి, పౌరులకు సమాచారాన్ని అందించడానికి ఈ చట్టం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.