ప్రజలకిచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయాలి
బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడు కుక్కడపు వెంకటేశ్వర్లు గౌడ్
గరిడేపల్లి, మార్చి 17 : ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని బీజేపీ పార్టీ మండల అధ్యక్షుడు కుక్కడపు వెంకటేశ్వర్లు గౌడ్ అన్నారు.బీజేపీ రాష్ట్ర పార్టీ ఆదేశాలు జిల్లా అధ్యక్షురాలు చల్లా శ్రీలత రెడ్డి సూచనల మేరకు మండల కేంద్రమైన గరిడేపల్లి లో మంగళవారం తహసిల్దార్ స్రవంతికి వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసరా పింఛన్లు అర్హులైన వృద్ధులు,వితంతువులు, దివ్యాంగులకు అందించడం లేదని,పెండింగ్ దరఖాస్తులను వెంటనే ఆమోదించాలని కోరారు.
గృహ నిర్మాణ పథకం కింద అర్హులైన పేదలకు ఇళ్ల మంజూరు ప్రక్రియను వేగవంతం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు చిత్తలూరి సోమయ్య గౌడ్,మండల పార్టీ ఉపాధ్యక్షుడు కుక్కడపు లక్ష్మయ్య,నర్సింగ్ నాగ సైదులు గౌడ్,పగిడి రాధాకృష్ణ,గుగులోతు రాజు నాయక్,యామగాని సాయి,పార్టీ నాయకులు పాల్గొన్నారు.




