16 July, 2026 | 6:47 AM

నేడే ‘మహా’ స్పీకర్ ఎన్నిక

09-12-2024 01:45 AM
  • మంత్రులుగా 11 మంది షిండే వర్గం ఎమ్మెల్యేలు
  • ఇంకా ధ్రువీకరించని ప్రభుత్వం

ముంబై, డిసెంబర్ 8: వీలైనంత త్వరగా కనీసం 11 మంది షిండే వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు కేబినేట్ మినిస్టర్లుగా ప్రమాణం చేయనున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. దీనికి సంబంధించి షిండే పార్టీ ఇప్పటికే జాబితాను సిద్ధం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ జాబితాలో గత ప్రభుత్వంలో పని చేసిన ఆరుగురు మంత్రుల పేర్లు ఉన్నట్లు వినికిడి. అంతే కాకుండా మిగిలిన వారు కొత్తవారని తెలుస్తోంది. మొదట శివసేన (షిండే వర్గం) 13 లేదా 14 మంత్రి పదవులు ఆశించినా కానీ తర్వాత జరిగిన పరిణామాల్లో 12 పోస్టులకు ఒప్పుకొన్నట్లు తెలుస్తోంది. 

స్పీకర్‌గా బీజేపీ ఎమ్మెల్యే

మహాయుతి ప్రభుత్వంలో స్పీకర్ పదవి కోసం బీజేపీ ఎమ్మెల్యే రాహుల్ నర్వేకర్ ఆదివారం నామినేషన్ దాఖలు చేశారు. గత ప్రభుత్వంలో కూడా నర్వేకర్ స్పీకర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. డిసెంబర్ 9 (సోమవా రం) మధ్యాహ్నం స్పీకర్ ఎన్నిక జరగనుంది.