మహిళలకు కుట్టుమిషన్ల పంపిణీ
మునిపల్లి, ఏప్రిల్ 6 : గ్రామ స్వరాజ్య సమస్త కుట్టు శిక్షణ కేంద్రాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశాల మేరకు సోమవారం మండలంలోని పెద్ద గోపులారం గ్రామంలో గ్రామ సర్పంచ్ బుడ్డ మల్లేశం తో పాటు రైకోడ్ మార్కెట్ కమిటీ చైర్మన్ సుధాకర్ రెడ్డి,ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలు బలోపేతం కావడానికి ఈ శిక్షణ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు.
మహిళల కోసం ఎన్నో పథకాలు ప్రజా ప్రభుత్వం ప్రవేశపెట్టి ఆర్థికంగా ఎదిగేందుకు ఎంతగానో కృషి చేస్తుందని తెలిపారు. అంతకుముందు శిక్షణ పొందిన మహిళలకు కుట్టు మిషన్లను అందజేశారు. అనంతరం బోరు మోటర్ ను ప్రారంభించి తాగునీటి ఎద్దడి నివారణకు కృషి చేశారు. ఈ కార్యక్రమంలో మండల్ ఉపాధ్యక్షులు రసూల్ పటేల్, మాజీ పాండు, ఆయా గ్రామాల నాయకులు పాల్గొన్నారు.




