calender_icon.png 1 February, 2026 | 2:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భక్తిశ్రద్ధలతో శని త్రయోదశి

01-02-2026 12:22:17 AM

వర్గల్ పుణ్యక్షేత్రంలో నిర్వహణ  

గజ్వేల్, జనవరి 31 (విజయక్రాంతి): తెలంగాణ జిల్లాల్లో సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వర్గల్  విద్యాధరి క్షేత్రంలో శనివారం శని త్రయోదశిని ఎంతో భక్తిశ్రద్ధలతో నిర్వహించా రు. ఆలయ వ్యవస్థాపక చైర్మన్ చంద్రశేఖర శర్మ సిద్ధాంతి నేతృత్వంలో వేద పండితులు 35వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ శని దేవుడి ప్రసన్నం చేసుకుంటే సకల శుభాలు కలుగుతాయని, ఆర్థిక, ఆరోగ్య సమస్యలు తొలగుతాయని స్పష్టం చేశారు.

శని దోష నివారణ నిమిత్తం స్వామివారికి తైలాభిషేకంతో పాటు నల్లటి నువ్వులు, నల్ల వస్త్రం అర్పించడం ద్వారా అష్టమ శని దోషం నుండి ఉపశమనం పొందడానికి శని త్రయోదశి అత్యంత పవిత్రమైనదని తెలిపారు. లోక కళ్యాణార్థమై నిర్వహించిన శని త్రయోదశి మహోత్సవంలో వెయ్యికి పైగా అభిషేకాలు జరగగా, ఆలయ కమిటీ ప్రత్యేక కృషి ఫలితంగా  వసంత పంచమి వేడుకలను వైభవంగా జరుపుకున్నట్లు సిద్ధాంతి చంద్రశేఖర శర్మ తెలిపారు. ముఖ్యంగా వార్షికోత్సవ సంబరాల సందర్భంగా ఆలయ సముదాయాన్ని నిర్వాహకులు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దగా, ఈ మహోత్సవాల్లో పాల్గొన్న భక్తులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో తీర్థప్రసాదాలతో పాటు మహాప్రసాదం అందజేశారు.