04-01-2026 12:00:00 AM
5000 మంది భక్తులకు మహా అన్నదానం
భీమదేవరపల్లి, జనవరి 3 (విజయక్రాంతి): హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొప్పూర్ గ్రామంలోని పంచము ఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో ఈ నెల ౬వ తేదీన విశేషంగా స్వామివారికి 1100 కిలోల పెరుగుతో ధధి స్నానాభిషేకానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని శ్రీపంచ ముఖ ఆంజనేయ స్వామి దేవాలయం చైర్మ న్ కాసం రమేష్ గుప్తా తెలిపారు. శనివారం మీడియాతో కాసం రమేష్ గుప్తా, మాజీ ఎంపీపీ అశోక్ ముఖర్జీ, గద్ద రాజమణి సమ్మయ్య, గద్ద సంపత్ లు మాట్లాడుతూ ఆలయం వార్షికోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం జనలో కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.
తోగుట్ట పీఠాధిపతి మాధవా నంద సరస్వతి స్వామితో పాటు సీఎం ఓఎస్‌డీ వేముల శ్రీనివాసులు ముఖ్య అతిథు లుగా హాజరవుతారని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్రస్థాయి సాంస్కృతిక పోటీలతో పాటు కళాకారుల భజన కార్యక్రమాలు ఉం టాయన్నారు. అనంతరం ఐదు వేల మంది భక్తులకు మహా అన్నదానం నిర్వహిస్తామన్నారు. కార్యక్రమం అనంతరం స్వామివా రి ప్రవచనాలు, మహా ఆశీర్వాదం ఉంటుందని భక్తులందరూ పాల్గొని స్వామి ఆశీస్సు లు పొందాలని నిర్వాహకులు కోరారు.