04-01-2026 12:00:00 AM
డిస్నీల్యాండ్ స్కూల్‌లో ఘనంగా నిర్వహణ
హైదరాబాద్, జనవరి 3 (విజయక్రాంతి): దామెర మండలం ఒగ్లాపూర్‌లోని డిస్నీల్యాండ్ ఉన్నత పాఠశాలలో శనివారం భార త మొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే 195వ జయం తిని ఘనంగా జరుపుకున్నారు. పాఠశాల వ్యవస్థాపకులు డి.సదయ్య, బి.లక్ష్మీ నివా సం, డైరె క్టర్లు బాలుగు శోభారాణి, డి. మీనా సావిత్రిబాయి చిత్రపటానికి పూలమాలవేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
కరస్పాండెం ట్ శోభారాణి, మీనా దినేష్, మహిళా ఉపాధ్యాయులు మాట్లాడుతూ నేడు భారత దేశంలో మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారంటే దానికి కారణం సావిత్రిబాయి అ ని కొనియాడారు. ప్రతి అమ్మాయి చదువు పట్ల ప్రత్యేక శ్రద్ధతో సమాజంలో ముందుండాలన్నారు. సావిత్రిబాయి వేషధారణలో బుద్దె శ్రీహర్ష 9వ తరగతి విద్యార్థిని ఏకపాత్రాభినయం తోటి విద్యార్థులను ఎంతగానో ఆకట్టుకుంది. పాఠశాల వ్యవస్థాపకులు సద య్య, లక్ష్మీనివాసం విద్యార్థులను ఉద్దేశించి స్వేచ్ఛ ను హద్దు మీరకుండా చదివి సమాజంలో పేరు తెచ్చుకోవాలని సూచించారు.