calender_icon.png 15 November, 2025 | 4:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దండోరా మోగేది అప్పుడే

15-11-2025 12:34:57 AM

లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ‘కలర్ ఫోటో’, ‘బెదురులంక 2012’ వంటి చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించారు నిర్మాత రవీంద్ర బెనర్జీ ముప్పానేని. ఆయన రూపొం దిస్తున్న తాజాచిత్రం ‘దండోరా’. మురళీకాంత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శివాజీ, నవదీప్, నందు, బిందుమాధవి, మనికా చిక్కాల, మౌనికారెడ్డి, రవికృష్ణ, మణిక, అనూష, రాధ్య, అదితి భావరాజు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో, సామాజిక స్పృహను కలిగించే విభిన్నమైన అంశంతో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. అగ్ర వర్ణాలకు చెందిన అమ్మాయిలను ప్రేమించి పెళ్లి చేసుకున్నా, ఆ వర్ణాలకు ఎదురు తిరిగినా ఎలాంటి దౌర్జన్యకాండ జరుగుతోందనే సున్నితమైన అంశాలను ఆధారంగా చేసుకుని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

ఈ సినిమా డిసెంబర్ 25న రిలీజ్ కానుంది. డేట్ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో ఓ ఖాళీ ప్రాంతంలో తవ్విన గొయ్యి కనిపిస్తోంది. అందులో ‘ఈ ఏడాదికి డ్రామటిక్‌గా ముగింపునిస్తున్నాం’ అనే క్యాప్షన్‌తో రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. ఈ చిత్రానికి సంగీతం: మార్క్ కే రాబిన్; సినిమాటోగ్రఫీ: వెంకట్ ఆర్ శాఖమూరి; ఎడిటర్: సృజన అడుసుమిల్లి; ఆర్ట్: క్రాంతి ప్రియం.