15-11-2025 12:36:29 AM
నాగార్జున హీరోగా నటించిన ‘నా సామిరంగ’ చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టింది కన్నడ అందం ఆషికా రంగనాథ్. ఈ ముద్దుగుమ్మ నటించిన కన్నడ చిత్రం ‘గత వైభవ’ తెలుగులో ‘గత వైభవం’ పేరుతో ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చిరంజీవితో ‘విశ్వంభర’లో, రవితేజతో ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమాల్లో నటిస్తోంది. అయితే, ఈ బ్యూటీ మరో అవకాశాన్ని అందుకున్నట్టు తెలుస్తోంది.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఆషిక.. హీరో తిరువీర్‌తో కలిసి ఓ ఫీల్‌గుడ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌లో నటిస్తోందట. డ్యూడ్, డ్రాగన్ వంటి చిత్రాలకు మాటల రచయితగా పనిచేసిన కృష్ణ చేపూరి దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని ఎస్‌కేఎన్ నిర్మిస్తున్నారట. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా వైవిధ్యమైన కథతో రూపొందని సమాచారం. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు త్వరలోనే మేకర్స్ అధికారికంగా వెల్లడించనున్నారు.