calender_icon.png 15 November, 2025 | 3:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పల్స్ రేటు పెంచుతుంది బేబీ..

15-11-2025 12:33:10 AM

హీరో శర్వా నుంచి వస్తున్న కొత్త సినిమా ‘బైకర్’. ఇందులో ఆయన మోటార్ సైకిల్ రేసర్‌గా ప్రేక్షకులను థ్రిల్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అభిలాష్‌రెడ్డి కంకర దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో మాళవిక నాయర్ హీరోయిన్ కాగా బ్రహ్మాజీ, అతుల్ కులకర్ణి ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

తాజాగా మేకర్స్ ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ‘ప్రెట్టీ బేబీ’ సాంగ్‌ను రిలీజ్ చేశారు. కృష్ణకాంత్ లిరిక్స్ రాయగా, జిబ్రాన్ ఈ పాటను స్వరపరుస్తూ యాజిన్ నిజార్, సుబ్లాషితో కలిసి పాడారు. ‘హార్ట్ సీటు ఖాళీగుంది.. వెదర్ చూస్తె కూల్‌గుంది బేబీ.. నెక్స్ లెవల్ స్టులు నీది.. పల్స్ రేటు పెంచుతుంది బేబీ..’ అంటూ సాగుతున్న ఈ పాటలో శర్వా, మాళవిక నాయర్ కెమిస్ట్రీ ఆకర్షణీయంగా ఉంది.

శర్వా తన డ్యాన్స్ మూమెంట్స్‌తో మెస్మరైజ్ చేస్తున్నారు. డిసెంబర్ 6న థియేటర్లలో విడుదల కానున్న ఈ చిత్రానికి సంగీతం: జిబ్రాన్; డీవోపీ: జే యువరాజ్; ఎడిటర్: అనిల్ కుమార్ పీ; ఆర్ట్: ఏ పనీర్ సెల్వం.