16 July, 2026 | 12:44 AM

మనం శాసించే రోజులు వచ్చాయ్

16-07-2026 12:00 AM
  1. బీసీలంతా ఏకమై రాజ్యాధికారం సాధించాలి
  2. టీఆర్పీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న

హైదరాబాద్, జూలై 15(విజయక్రాంతి): ఇన్నాళ్లూ మనం ఓట్లేసి ఇతరులను గెలిపిం చాం.. పల్లకీలు మోశాం.. ఇకపై మనమే సీట్లు సాధించి శాసించే రోజులు వచ్చాయి. బీసీలంతా ఏకమై రాజ్యాధికారం దిశగా అడుగులు వేయాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ(టీఆర్పీ) అధినేత, ఎమ్మెల్సీ తీన్మా ర్ మల్లన్న పిలుపు నిచ్చారు. బుధవారం ఉమ్మడి మెదక్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన పలువురు నాయకులు తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా మల్ల న్న పార్టీలో చేరిన వారికి కండువా కప్పి ఆ హ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పార్టీని నమ్ముకుని వచ్చిన ప్రతి ఒక్క రికీ సముచిత స్థానం, గౌరవం ఉంటుంది అని మల్లన్న స్పష్టం చేశారు.కాగా ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్‌చార్జి బసపురం నగేష్ ము దిరాజ్ ఆధ్వర్యంలో నర్సాపూర్ నియోజకవర్గం నుంచి నత్తి అంబదాస్, వెంకటేష్, ప్రే మ్, ఆనంద్ కురుమ, రాజలింగం గౌడ్, ఉసిప్, సుధాకర్ తదితరులు టీఆర్పీలో చేరారు.

వారందరికీ ఎమ్మెల్సీ మల్లన్న కండువా కప్పి, పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో నర్సాపూర్ ఇంచార్జ్ రాము లు, మెదక్ జిల్లా యూత్ అధ్యక్షులు పోతుల రవీందర్,అనిల్, జహీరాబాద్ ఇన్‌చార్జి నరసింహ, సంగారెడ్డి జిల్లా మహిళా అధ్యక్షురా లు లతక్క రజిత ,హర్ష యూసుఫ్, తదితరులు కార్యకర్తలు పాల్గొన్నారు.

ఘట్‌కేసర్ నుంచి..

ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఇన్‌చార్జి బంధారపు నర్సయ్య గౌడ్ ఆధ్వర్యంలో ఘట్‌కేసర్ ప్రాంతానికి చెందిన పలువురు పార్టీలో చేర గా, వారికి  కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారు రాములు యాదవ్, మల్లయ్య నేత, వెంకట్ రెడ్డి, రాజు సాగర్, నరసింహ గౌడ్, వి. ఉపేందర్ నేత ఉన్నారు.

అదేవిధంగా బొమ్మ వెంక టేశ్వర్లు నేతను ఘట్‌కేసర్ డివిజన్ అధ్యక్షుడిగా నియమిస్తూ, పార్టీ అధినేత ఎమ్మెల్సీ తీ న్మార్ మల్లన్న నియామక పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో స్టేట్ ఆఫీస్ కోఆర్డినే టర్ లింగం యాదవ్, నాగోల్ డివిజన్ అధ్యక్షుడు సురేందర్ తదితరులు పాల్గొన్నారు.