calender_icon.png 5 November, 2025 | 12:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఒప్పందానికి తూట్లు!

22-10-2025 12:00:00 AM

ఈజిప్టు వేదికగా అక్టోబర్ 10న ఇజ్రాయెల్, హమాస్ మధ్య శాంతి ఒప్పందం జరిగింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన 20 సూత్రాల ప్రణాళికలో భాగంగా మొదటి దశ ఒప్పందం కింద ఇరువురి మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన సంగతి తెలిసిందే. దీంతో గాజాలో బాంబుల మోత, ఆకలి కేకలు ఆగిపోతాయని అంతా భావించారు. కానీ 10 రోజులు తిరగకముందే ఇజ్రాయె  ల్, హమాస్‌లు శాంతి ఒప్పందాన్ని ఉల్లఘించినట్లు తెలుస్తోంది. హమా స్ స్థావరాలపై ఆదివారం ఇజ్రాయెల్ రక్షణ దళం (ఐడీఎఫ్) గగనదాడులకు పాల్పడడంతో గాజా మరోసారి రక్తసిక్తమయింది.

రఫాలో తమ సై నికులపై హమాస్ దాడులు చేసి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని.. అందుకే తాము గగనతల దాడులు చేశామని ఇజ్రాయెల్ పేర్కొంది. ఈ దాడిలో ఇద్దరు ఇజ్రాయెల్ సైనికులు సహా కనీసం 45 మం ది పాలస్తీనీయులు మరణించి ఉంటారని తెలుస్తోంది. అంతేకాదు తమ 28 మంది బందీలను ఇప్పటికీ తిరిగి ఇవ్వడంలో హమాస్ వెనుకాడుతోందని ఇజ్రాయెల్ పేర్కొంటుంది. హమాస్ నిబంధనలు ఉల్లంఘించడం తో.. ఇజ్రాయెల్ రఫా క్రాసింగ్‌ను మూసేసింది. దీంతో గాజాకు అందు తున్న మానవతా సాయం నిలిచిపోయింది.

అయితే తమ నిర్ణయాన్ని వె నక్కి తీసుకుంటున్నట్లు తెలిపిన ఇజ్రాయెల్ మంగళవారం నుంచి 300 ట్రక్కులను రఫా క్రాసింగ్ మీదుగా గాజాకు అనుమతించనున్నట్లు ఐక్యరాజ్యసమితికి వెల్లడించింది. మరోవైపు హమాస్ మాత్రం కాల్పుల విరమ ణ ఒప్పందాన్ని తొలుత ఉల్లఘించింది ఇజ్రాయెలేనంటూ ఆరోపించింది. ఇజ్రాయెల్ దాడికి ముందు గాజాలోని పాలస్తీనా పౌరులపై హమాస్ దాడులకు పాల్పడబోతున్నట్లు తమకు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందిందంటూ అమెరికా విదేశాంగ శాఖ పేర్కొంది. కానీ అదంతా ఇజ్రాయెల్ చేస్తున్న దుష్ప్రచారమంటూ హమాస్ కొట్టిపారేసింది. తాజాగా ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనకు గురవ్వడం ట్రంప్‌కు ఆగ్రహం తెప్పించింది.

హమాస్, ఇజ్రాయెల్ మధ్య జరిగిన ఒప్పందం చాలా గొప్పదని, దానిని మంచిగా ఉంచాలని, లేకుండా హమాస్‌ను నిర్మూలించేం దుకు వెనుకాడబోమని హెచ్చరించారు. హింస తగ్గుతుందనే ఆశతో ప్ర పంచ ప్రతినిధులంతా కలిసి కాల్పుల విరమణ ఒప్పందం చేశామని, ఇలా నిరంతర దాడులకు పాల్పడితే చూస్తూ ఊరుకునేది లేదని సున్నితంగా బె దిరించారు. కానీ హమాస్‌కు మరో అవకాశమిచ్చేందుకు వారిపై దాడి చే యడం లేదని పేర్కొన్నారు. కాగా ట్రంప్ ప్రతిపాదించిన 20 సూత్రాల శాంతి ప్రణాళికకు సంబంధించి తదుపరి దశ చర్చలకు సన్నాహాలు ప్రా రంభించింది.

పశ్చిమాసియాలోని అమెరికా రాయబారి స్టీవ్ విట్‌కాఫ్, ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్‌లు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో భేటీ అయ్యారు. ఆ తర్వాత మధ్యవర్తులైన ఈజిప్ట్, టర్కీ, ఖతార్ ప్రతినిధుల సమక్షంలో కైరో వేదికగా హమాస్, ఇజ్రాయెల్ ప్రతినిధుల మధ్య రెండో దఫా శాంతి చర్చలు జరగనున్నాయి. అయితే తాజాగా ఇజ్రాయెల్, హమాస్ మధ్య జరిగిన పరస్పర దాడులు గాజాలో పరిస్థితులను మళ్లీ మొదటికి వచ్చాయనే సంకేతాలు కనిపిస్తున్నాయి. దీన్నిబట్టి ఇరువు రి మధ్య జరిగిన శాంతి ఒప్పందానికి తూట్లు పడినట్లే!