29 July, 2026 | 9:13 PM

Breaking News

సువర్ణ వనమాల దశదిన కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు   •   రోటర్ డామ్ ఇంటర్నేషనల్ స్కూల్ కు ప్రతిష్టాత్మక ఆర్ఐడిఎస్ అంతర్జాతీయ అవార్డు   •   ఎర్రుపాలెం మండలంలో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు   •   నెమ్లి సాయిబాబా ఆలయంలో ఎమ్మెల్యే పోచారం ప్రత్యేక పూజలు   •   నవ చైతన్య యువజన సంఘం ఆధ్వర్యంలో రెయిన్ జాకెట్స్ పంపిణీ   •   రోడ్డు దాటుతుండగా కారు ఢీకొని వృద్ధురాలి మృతి   •   భూ సర్వే పారదర్శకంగా నిర్వహిస్తాం   •   జిల్లాలో సర్ ప్రక్రియ 98 శాతం పూర్తి   •   వేద వ్యాసునీ జయంతి ఉత్సవాలు   •   బిజెపి ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో సంత్ శిరోమణి శ్రీ రవిదాస్ మహారాజ్ 650వ జయంతి వేడుకలు   •  

గ్యాస్ ధరల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి

09-06-2026 12:00 AM

కరీంనగర్, జూ న్ 8 (విజయక్రాం తి): కేంద్ర ప్రభు త్వం వంట గ్యాస్ ధ రలను వరుసగా పెంచుతూ సామాన్య ప్రజలపై అదనపు ఆర్థిక భారం మోపుతోందని బీఆర్‌ఎస్ నాయకురాలు, మాజీ కార్పొరేటర్ గందే మాధవి ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి ప్రజలు ఇబ్బందులు పడుతున్న తరుణంలో గ్యాస్ ధరల పెంపు కుటుంబాల బడ్జెట్ను మరింత దెబ్బతీస్తోందన్నారు.

ప్రధానమంత్రి ఉజ్వల యోజన పేరుతో పేద మహిళలకు గ్యాస్ కనెక్షన్లు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం, ఇప్పుడు అదే పేదలపై ధరల భారాన్ని మోపడం దురదృష్టకరమని ఆమె విమర్శించారు. గత కొన్నేళ్లుగా గ్యాస్ సిలిండర్ ధరలు గణనీయంగా పెరిగి మధ్యతరగతి, పేద కుటుం బాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు. కాబట్టి తక్షణమే గ్యాస్ ధరల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.