calender_icon.png 27 November, 2025 | 11:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దీక్షాదివస్ కార్యక్రమం విజయవంతం చేయాలి

27-11-2025 12:11:55 AM

నిజామాబాద్ 26:నవంబర్ (విజయ క్రాంతి): జిల్లా బి ఆర్ ఎస్ పార్టీ కార్యాలయంలో  పార్టీ జిల్లా అధ్యక్షులు జీవన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన  నవంబర్ 29  దీక్షా దివస్ కార్యక్రమం విజయవంతం చేయడానికి ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. ఈ కార్యక్రమం లో మాజీ ఎమ్మెల్యే బిగలా గణేష్ గుప్తా, మాజీ ఎమ్మెల్సీ విజిగౌడ్, అయేషా,జిల్లా నాయకులు నూడా ప్రభాకర్, సిర్ప రాజు, సత్య ప్రకాష్, వివిధ మండలాల అధ్యక్షులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సమావేశాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే వేముల మాట్లాడుతూ  తెలంగాణ రాష్ట్రం ఉనికి ఉన్నది అంటే 29 నవంవర్ 2009 నాడు కేసీఆర్ చేసిన దీక్ష ఫలితమే తనకున్న అన్ని పదవులను త్యాగం చేసి ,14  ఏండ్లు సుదీర్ఘ పొరటము చేసి చివరకు చావు నోట్లో తలపెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన గొప్ప నాయకుడు కేసీఆర్. 20 సంవత్స రాలుగా తెలంగాణ సమాజం యావత్తు దేవతగా పూజించిన తెలంగాణతల్లి రూపాన్ని మార్చ డం, తెలంగాణ తల్లి చేతిలోని బతుకమ్మ ను మాయం చేయడం, తెలంగాణ ఉద్యమంలో అసు వులు బాసిన తెలంగాణ అమరవీరులను స్మరించుకొనేందుకు కేసీఆర్ కట్టించిన తెలంగాణ అమరుల స్మారక జ్యోతి ప్రాంగణానికి తాళం వేయడం గోదావరి, కృష్ణలో మన నీళ్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దొంగలించుకపోతుంటే మన నీళ్ల కోసం మనం కొట్లాడే సందర్బంలో చంద్రబాబు నాయుడు దగ్గర AP ప్రభుత్వంలో ఇరిగేషన్ సెక్రటరీ గా పని చేసిన ఆదిత్యనాతన్ అనే ఐఏఎస్ ఆఫీసర్ ని ఇప్పుడు మన తెలంగాణ ఇరిగేషన్ శాఖకు సలహాదారుడిగా నియమిం చడం లాంటి ఎన్నో రేవంత్ రెడ్డి నిర్ణయాలు తెలంగాణ ఆస్థిత్వానికి ఉనికికి భంగం కలిగించేవే. 

తెలంగాణ సమాజంలో మళ్ళీ ఆ ఉద్యమ స్ఫూర్తిని రగిలించడానికి తెలంగాణ ఉద్యమ పోరాటంలో  కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి కేసీఆర్ గారి దీక్ష ను తెలంగాణ సమాజానికి మళ్ళీ ఒకసారి గుర్తు చేయాల్సిన అవసరం ఉన్నది కావున ఈ నెల 29 న జరిగే దీక్ష దివస్ కార్యక్రమానికి జిల్లాలోని ప్రతి మండలం నుండి 100 మంది కార్యకర్తలు, నిజామాబాద్ కార్పొరేషన్ ప్రతి డివిజన్ నుండి 50 మంది కార్యకర్తల చొప్పున 5000 పై చిలుకు తరలివచ్చి తెలంగాణ ఆస్థిత్వానికి భంగం కలిగిస్తున్నటువంటి  రేవంత్ రెడ్డి కి చెమటలు పట్టే విధంగా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనీ కోరారు.