calender_icon.png 27 November, 2025 | 9:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జాతీయస్థాయి సబ్ జూనియర్స్ కబడ్డీ పోటీలకు నేరేడుచర్ల క్రీడాకారుడు వరాల వరుణ్ ఎంపిక

27-11-2025 12:11:31 AM

నేరేడుచర్ల , నవంబర్ 26 : జాతీయస్థాయి సబ్ జూనియర్ కబడ్డీ పోటీలకు నేరేడుచర్లకు చెందిన వరాల వరుణ్ ఎంపికయ్యారు. హైదరాబాదులో జరిగిన క్యాంపస్ సెలక్షన్‌లో ఆయనను ఎంపిక చేసినట్లు తెలియజేశారు. ఈ నెల 27 నుండి 30 వరకు హర్యానాలో జరగనున్న 35వ సబ్ జూనియర్స్ జాతీయ స్థాయి కబడ్డీ పోటీలలో తెలంగాణా రాష్ట్ర జట్టు తరుపున వరుణ్ ప్రతినిద్యం వహించనున్నారు.

ఈ క్రీడాకారుడి కి సహకరించి ప్రోత్సహించి అవకాశం కల్పించిన సూర్యాపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్ష,కార్యదర్శులు అల్లం ప్రభాకర్ రెడ్డి, నామా నరసింహరావుకు నేరేడుచర్ల మండల, కబడ్డీ అసోసియేషన్ తరుపున ధన్యవాదములు తెలిపిన వారిలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు నూకల  సందీప్ రెడ్డి, కార్యదర్శి, సైదులు, మరియు తల్లిదండ్రులు వరాల సైదులు, కిరణ్మయి  ఉన్నారు.