నిరుపేదలు సీఎం రిలీఫ్ ఫండ్‌ను సద్వినియోగం చేసుకోవాలి
- లబ్ధిదారులకు రూ.1.70 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ
- ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్
ముషీరాబాద్, జూన్ 30 (విజయక్రాంతి): సీఎం రిలీఫ్ ఫండ్‌ను పేదలు సద్వినియోగం చేసుకోవాలని ముషీరాబాద్ ఎ మ్మెల్యే ముఠా గోపాల్ అన్నా రు. ఈ మేరకు మంగళవారం గాంధీనగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సీఎంఆర్‌ఎఫ్ ఫండ్ కోసం గతంలో దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులు నలుగురికి 1లక్షా 70 వేల రూపాయల విలువగల చెక్కులను ముషీరాబాద్ శాసన సభ్యులు ముఠా గోపాల్ పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిరుపేదలు సీఎం రిలీఫ్ ఫండ్ ను ఉపయోగించుకోవాలని ఆయన సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో యువ నాయకుడు ముఠా జయసింహ, డివిజన్ అధ్యక్షులు వల్లాల శ్యామ్ యాదవ్, వై. శ్రీనివాస్, శంకర్ ముదిరాజ్, మీడియా ఇంచార్జ్ ముచ్చకుర్తి ప్రభాకర్, కార్యదర్శి సాయి కృష్ణ, బింగినవీన్, మహమ్మద్ అలీ, రామచందర్, ముదిగొండ మురళి, శంకర్ గౌడ్, ప్రభాకర్, శ్రీహరి, పలువురు లబ్ధిదారులు పాల్గొన్నారు.






