17 April, 2026 | 2:38 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

నేడు గవర్నర్‌కు స్కాం వివరాలు!

27-01-2026 01:22 AM
  1. సింగరేణి కుంభకోణంపై బీఆర్‌ఎస్ నేతల ఫిర్యాదు 

వారి లూటీపై సాక్షాధారాలతో నివేదిక ఇవ్వనున్న గులాబీ పార్టీ

హైదరాబాద్, జనవరి 26 (విజయక్రాంతి) : సింగరేణి కుంభకో ణంపైన నేడు బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మను కలవనున్నారు. తెలంగాణలోని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిలో కూ రుకుపోయిందని, ముఖ్యంగా సింగరేణి సంస్థలో వేల కోట్ల ప్రజాధ నాన్ని యథేచ్ఛగా లూటీ చేస్తోందని, ఈ భారీ కుంభకోణంపై సమగ్ర విచారణ జరిపించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరనుంది.

ఈ మేరకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయకత్వంలో పార్టీ ప్రతినిధి బృందం గవర్నర్‌ను మంగళవారం కలవాలని నిర్ణయించు కుంది. ఈ భేటీ సందర్భంగా సింగరేణిలో జరిగిన అవినీతికి సంబం ధించిన పూర్తి ఆధారాలు, లోతైన వివరాలతో కూడిన సమగ్ర నివేదికను బీఆర్‌ఎస్ నేతలు గవర్నర్‌కు సమర్పించనున్నారు. సింగరేణి వం టి ప్రతిష్టాత్మక సంస్థలో జరిగిన ఈ భారీ కుంభకోణంలో ముఖ్యమంత్రితోపాటు వారి కుటుంబ సభ్యులు, ఉప ముఖ్యమంత్రి, పలువురు మం త్రులు నేరుగా భాగస్వాములయ్యారని పార్టీ ఆరోపిస్తోంది.

ఈ వ్యవ హారంపై రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న గవర్నర్ వెంటనే స్పం దించి, తగిన చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేయనున్నారు. రాష్ట్ర సంపదను కాపాడాల్సిన బాధ్యతను విస్మరించి, ఇంతటి భారీ స్కామ్‌లో భాగస్వాములైన ముఖ్యమంత్రికి, ఇతర మంత్రులకు వారి పదవుల్లో కొనసాగే నైతిక, రాజ్యాంగ పరమైన హక్కు లేదని బీఆర్‌ఎస్ స్పష్టం చేసింది. ఇదే అంశాన్ని గవర్నర్‌కు తెలియజేయనున్నది. నేడు జరగబోయే ఈ కార్యక్రమంలో పార్టీకి చెందిన ముఖ్య ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర సీనియర్ నాయకులు పాల్గొని గవర్నర్‌కు తమ నిరసనను తెలియజేయనున్నారు.