calender_icon.png 27 January, 2026 | 3:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘సీసీఎల్‌ఏ’లో జాతీయ జెండా ఆవిష్కరణ

27-01-2026 01:21:50 AM

హైదరాబాద్, జనవరి 26: గణతంత్ర దినోత్సవం సందర్భంగా నాంపల్లిలోని సీసీఎల్‌ఏ కార్యాలయంలో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో సీసీఎల్‌ఏ కమిషనర్ లోకేష్ కుమార్ పాల్గొని జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం సీసీఎల్‌ఏ ప్రాంగణంలోని డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్, టీజీటీఏ, టీజీఆర్‌ఎస్‌ఏ కార్యాలయాల ముందు డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ రామకృష్ణ, టీజీటీఏ అధ్యక్షులు రాములు టీజీఆర్‌ఎస్‌ఏ అధ్యక్షులు బాణాల రాంరెడ్డి గారితో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించి ప్రజలకు, ఉద్యోగులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వి.లచ్చిరెడ్డి,టీజీఆర్‌ఎస్‌ఏ జనరల్ సెక్రటరీ భిక్షం, అసోసియేట్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ రెడ్డి, కోశాధికారి మల్లేష్, జాయింట్ సెక్రటరీ సురేష్ కుమార్, టీజీఆర్‌ఎస్‌ఏ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు మంజుల, సీసీఎల్‌ఏ కార్యాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.