15 April, 2026 | 12:04 PM

Breaking News

ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •   అంబేద్కర్ భారత రాజ్యాంగ శిల్పి   •  

తీరనున్న నారాయణపూర్ రిజర్వాయర్ కష్టాలు

30-05-2025 01:43 AM

ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కృషితో రూ. 43 కోట్లు విడుదల చేయడానికి హామీ ఇచ్చిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి 

చొప్పదండి, మే 29 (విజయ క్రాంతి): గంగాధర మండ లం నారాయణపూర్ రిజర్వాయర్ నిర్వాసితుల కష్టాలు తీరనున్నాయి. కరీంనగర్లో రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసి నారాయణపూర్ రిజర్వాయర్ ను గురించి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం  వివరించారు. దీంతో స్పందించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రాజెక్టుకు నిధులు కేటాయించడం ఇప్పటికే ఆలస్యమైందని, ఇచ్చిన మాట ప్ర కారం నారాయణపూర్ ప్రాజెక్టు కింద భూసేకరణకు  23 కో ట్లు,  ప్రాజెక్టు పూర్తికి మరో 20 కోట్లు కేటాయిస్తామని  మం త్రి ఎమ్మెల్యే కు హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మే డిపల్లి సత్యం మాట్లాడుతూ నారాయణపూర్ భూ నిర్వాసితు ల కష్టాలను తాను స్వయంగా చూసినట్లు  గుర్తు చేశారు. ప్రతిపక్షంలో నారాయణపూర్ రిజర్వాయర్ ను పూర్తి చేసి నిర్వా సితులను ఆదుకోవాలని  పోరాటం చేసినట్లు తెలిపారు.  గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం  నారాయణపూర్ నిర్వాసితుల సమస్యలను పట్టించుకోలేదని విమర్శించారు.

ఎన్నికల సమయంలో గ్రామానికి వచ్చిన సందర్భంలో నారాయణపూర్ రిజర్వాయర్  పూర్తి చేస్తామని, నిర్వాసితులకు అన్యాయం చేస్తామని హామీ ఇచ్చినట్లు గుర్తు చేశారు. ఇచ్చిన హామీ మేరకు రిజర్వాయర్ పరిస్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినట్లు, మంత్రు లు ఉత్తంకుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్లను నారాయణపూర్ గ్రామానికి తీసుకువచ్చి, ఇక్కడి నిర్వాసితుల కష్టాలను ప్రత్యక్షంగా చూపించినట్లు తెలిపారు.

దీంతో స్పందించిన మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి రిజర్వాయర్ను పూర్తి చేయడానికి నిధులు కేటాయిస్తామని ఆనాడు హామీ ఇచ్చినట్లు గుర్తు. ఇచ్చిన  హా మీ మేరకు 43 కోట్లు చేస్తామని మంత్రి హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఈ సందర్భంగా నారాయణపూర్ నిర్వాసితుల పక్షాన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తంకుమార్ రెడ్డికి ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు.