04-12-2025 12:00:00 AM
జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి), డిసెంబర్3: దివ్యాంగులను గౌరవంగా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిదని, దివ్యాంగుల రక్షణకు ప్రతి ఒక్కరూ ప్రత్యేక శ్రద్ద చూపాలని సీఆర్టీ రమేష్ అన్నారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా మండల కేంద్రం అర్వపల్లిలో దివ్యాగుల ఆధ్వర్యంలో ప్రత్యేక ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా విద్యార్థులకు క్రీడా పోటీలు నిర్వహించి గెలుపొందిన దివ్యాంగ విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఉపాధ్యాయులు రామాంజనేయులు, వినీత, కీర్తి, దివ్యాంగ విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.