04-12-2025 12:00:00 AM
కోదాడ డిసెంబర్ 3: కోదాడ పట్టణం కొమరబండ వార్డుకు చెందిన గొర్రెల కాపరి బొమ్మకంటి వీరయ్య గొర్రె ఒకటి నెలరోజుల క్రితం పోతు పిల్లకి జన్మనిచ్చింది. ప్రమాదవశాత్తు గొర్రె పిల్ల పొట్టపగిలి పేగులు బయటకు రావడంతో బుధవారం కోదాడ ప్రాంతీయ పశువైద్యశాలకు తీసుకుని వచ్చారు.
అసిస్టెంట్ డైరెక్టర్ డా పి పెంటయ్య గంటన్నర పైన శ్రమించి పొట్ట తెరిచి బైటకు వచ్చిన పేగులు పొట్ట భాగాలను బక్కి లోనికి వేసి పగిలిన పొట్ట భాగాన్ని మూడువరుసలుగా కుట్లు వేసి ఆపైన చర్మాన్ని కుట్లు వేసి విజయవంతంగా శస్త్ర చికిత్స చేసి గొర్రెపిల్ల కు పునఃప్రాణం పోశారు. శస్త్ర చికిత్సలో సిబ్బంది రాజు చంద్రకళ , అఖిల్ , హరికృష్ణ పాల్గొన్నారు