1 July, 2026 | 2:07 AM

ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ త్వరగా పూర్తి చేయాలి

01-07-2026 01:36 AM

కలెక్టర్ కె.హరిత

కుమ్రం భీం ఆసిఫాబాద్, జూన్ 30 (విజయక్రాంతి): సిర్పూర్(టి) మండలంలోని పెట్ మహెలసిమ్లా కాలనీలో ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీని జిల్లా కలెక్టర్ కె. హరిత మంగళవారం పరిశీలించారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా ఫారాల పంపిణీ, సేకరణను వేగంగా పూర్తి చేయాలని, బూత్ స్థాయి అధికారులు ఇంటింటికి వెళ్లి ఫారాలు సేకరించి వివరాలను బీఎల్‌ఓ యాప్లో నమోదు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రహీమొద్దీన్, ఎంపీడీఓ ప్రసాద్, సూపర్వైజర్లు, బీఎల్‌ఓలు పాల్గొన్నారు. 

కాగజ్నగర్ పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలను జిల్లా కలెక్టర్ కె. హరిత ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులు 100 శాతం పాఠశాలకు హాజరయ్యేలా ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని, నాణ్యమైన విద్యతో పాటు రుచికరమైన మధ్యాహ్న భోజనం అందించాలని సూచించారు. వర్షాకాలం దృష్ట్యా పరిశుభ్రత, విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు. ప్రిన్సిపాల్ జయప్రద, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.