5 June, 2026 | 3:21 AM

భక్తిశ్రద్ధలతో సహస్ర సువాసిన్యర్చన మహోత్సవం

05-06-2026 01:41 AM

పూజల్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్

దేవీ నామస్మరణతో నిండిన క్షేత్రం

కొండపాక, జూన్ 4: కొండపాక మండ లం మర్పడగ గ్రామంలోని శ్రీవిజయదుర్గా సమేత సంతాన మల్లికార్జున స్వామి క్షేత్రంలో గురువారం సహస్ర సువాసిన్యర్చన అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. క్షత్ర నిర్వాహకులు డాక్టర్ చెప్పెల హరనాథ్ శర్మ ఆధ్వర్యంలో దైవత్వం ఉట్టిపడేలా కార్యక్ర మం అంగరంగ వైభవంగా జరిగింది.

ఉద యం 6 గంటలనుంచి సాయంత్రం వరకు పూజా కార్యక్రమాలు నిర్వహించారు.వేద మంత్రాల మధ్య దేవీ నామస్మరణ తో క్షేత్రం నిండిపోయింది. 1500 సుహాసినిలతో పా టు ఆరు వేలకు పైగా తెలంగాణ,ఆంద్రప్రదే శ్ తదితర ప్రాంతాలనుంచి వచ్చిన భక్తులు పాల్గొని పూజలు చేశారు. గణపతి పూజ , స్వస్తివాచనం, పంచవ్య ప్రాశనము, దీక్షాధారణ, గోపూజ, వాస్తు నవగ్రహ దిక్పాలక, చతశష్ట యోగిని, నవగ్రహ దిక్పాలక సర్వతోభద్ర స్థాపనము, నీజనసేవ, మంత్రపుష్ప ము అనంతరం సహస్రసువాసిన్యర్చన తదితర కార్యక్రమాలు జరిపారు.

సుహాసిని పూ జ శాస్త్రృక్తంగా నిర్వహించి పసుపు కుంకుమ గాజులు వస్త్రాలు అందజేశారు. లలిత సహస్రనామాలు చదువుతూ ప్రత్యేక పూజ కా ర్యక్రమాలు జరిపారు. కార్యక్రమంలో కలెక్టర్ హైమావతి పాల్గొని అమ్మవారికి పూజ లు చేసి సహస్రనామాలను జపించారు. 

నిత్యం అమ్మను స్మరించాలి

ప్రతి ఒక్కరు భక్తి భావాన్ని పెంపొందించుకోవడంతో పాటు నిత్యం లలితాంబికా అమ్మవారి స్మరించాలని రాంపూర్ పీఠాధిపతి మాధవానంద సరస్వతి స్వామి అన్నారు . విజయ దుర్గ మాత క్షేత్రంలో అమ్మవారి స్వరూపాలైన సుహాసినిలను అర్చన చేయడం ఈ ప్రాంతం పుణ్యం దక్కించుకుందన్నారు.

వర్చువల్ గా వీక్షించిన కంచి పీఠాధిపతి

ఇటీవల క్షేత్రాన్ని సందర్శించిన కంచి కామకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి స్వామి సహస్ర సువాసిన్యర్చన కార్యక్రమా న్ని వర్చువల్ గా వీక్షించారు. సుహాసిని అర్చన కార్యక్రమాన్ని చూసి క్షేత్రం నిర్వహిస్తున్న కార్యక్రమాలు అభినందించారు ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండాలని ఈ ప్రాంత ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని దివ్యాశీస్సులు అందజేశారు.

కార్యక్రమంలో దార్మిక ఉపన్యాసకులు దోర్బల ప్రభాకరశర్మ మాజీ జిల్లా పరిషత్ చైర్పర్సన్ వేరేటి రోజా రాధా కిషన్ శర్మ, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వేద పండితులు భక్తులు వేలాదిగా పాల్గొన్నారు. స్వర్ణ కిరీట ధారణ తో అలంకరించిన విజయదుర్గమాతను భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకుని పూజలు చేశారు. కోదండ రామశర్మ నీ రాజన కార్యక్రమం నిర్వహించారు.