8 June, 2026 | 1:50 AM

వ్యవసాయ, గ్రామీణ కార్మిక సంఘం జిల్లా మహాసభలను విజయవంతం చేయాలి

08-06-2026 12:09 AM

11న భారీ ప్రదర్శన, ప్రారంభ సభ, జిల్లా కార్యదర్శి రేపాకుల శ్రీనివాస్ పిలుపు

మణుగూరు, జూన్ 7 (విజయక్రాంతి) : మణుగూరు పట్టణంలో జరిగే తెలంగాణ వ్యవసాయ, గ్రామీణ కార్మిక సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 4వ మహాసభలను విజయవంతం చేయాలని జిల్లా కార్యదర్శి రేపాకుల శ్రీనివాస్  పిలుపు నిచ్చారు. ఆదివారం శ్రామిక భవన్లో నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన  మాట్లాడారు. ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షుడు మచ్చ వెంకటేశ్వర్లు, రాష్ట్ర కమిటీ సభ్యు డు అన్నవరపు కనకయ్య ముఖ్య అతి థులుగా హాజరయ్యారు.

ఈనెల 11వ తేదీ గురువారం మణుగూరులోని కిన్నెర కళ్యాణ మండపంలో జిల్లా 4వ మహా సభలు నిర్వహిస్తున్నామని, శ్రీనివాస్ తెలిపారు. ఈ మహాసభలకు వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ కార్యదర్శి కామ్రే డ్ బి. వెంకట్ హాజరవుతారని చెప్పారు. మహాసభల సందర్భంగా వ్యవసాయ కార్మికులతో భారీ ప్రదర్శన నిర్వహించను న్నట్లు వెల్లడించారు. ప్రజా, కార్మిక వ్యతి రేక విధానాలపై జరుగుతున్న పోరాటాలలో వ్యవసాయ కార్మిక సంఘం ఎల్లప్పుడూ ముందుంటుందని ఆయన పేర్కొన్నారు.

కూలీలు, శ్రామిక ప్రజల సమస్య ల పరిష్కారం కోసం సంఘం నిరంతరం ఉద్యమిస్తోందని, కూలి రేట్ల పెంపుదల కోసం పోరాడి కార్మికులకు అండగా నిలిచిందన్నారు. అణచివేత,  వెట్టిచాకిరి, బానిసత్వం, అంటరానితనం వంటి సామాజిక దురాచారాలకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలు నిర్వహించిందని  తెలిపారు. ప్రజల సమస్యల కోసం నిత్యం పోరాడే సంఘానికి కూలీలు, కార్మికులు అండగా నిలవాలని, ప్రజల పక్షాన పోర డే వ్యవసాయ కార్మిక సంఘాన్ని అన్ని వర్గాల ప్రజలు బలపరచాలని కోరారు.

ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ, పోడు సాగుదారులపై అటవీశాఖ అధికారుల దాడులను వెంటనే నిలిపివేయాలని, వలస  ఆదివాసులకు అటవీ హక్కులు కల్పించాలని, ఉపాధి హామీ కూలీలకు రోజుకు రూ.600 వేతనం ఇవ్వాలని, అలాగే అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు గద్దల శ్రీనివాసరావు, జిల్లా కమిటీ సభ్యులు సత్రపల్లి సాంబశివరావు, మండల కన్వీనర్ కొడిశాల రాములు, వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షులు పిట్టల నాగమణి పాల్గొన్నారు.